తెలుగు సినిమా సెట్లో త‌మిళం నేర్చుకుంటున్న పంజాబీ భామ‌

Tue,June 18, 2019 10:49 AM
mehreen learns Tamil on the set of her Telugu film

నాని హీరోగా తెర‌కెక్కిన కృష్ణ‌గాడి వీర ప్రేమ గాథ సినిమాతో తెలుగు తెర‌కి ప‌రిచ‌యమైన పంజాబీ భామ మెహ‌రీన్ కౌర్ పిర్జాదా. కృష్ణ‌గాడి వీర ప్రేమ గాథ సినిమాలో మెహ‌రీన్ న‌ట‌న‌కి పెద్ద‌గా మార్కులు ప‌డ‌క‌పోయిన ఆ త‌ర్వాత ఈ అమ్మ‌డికి మహానుభావుడు, రాజా ది గ్రేట్ వంటి హిట్ చిత్రాల‌లో న‌టించే అవ‌కాశం ద‌క్కింది. ఆ త‌ర్వాత మెహ‌రీన్ న‌టించిన కేరాఫ్ సూర్య, జవాన్, పంతం , నోటా చిత్రాలు అప‌జ‌యాన్ని మూట‌గ‌ట్టుకున్నాయి .దీంతో తెలుగులో మెహ‌రీన్ ప‌ని అయిపోయింద‌నుకున్న స‌మ‌యంలో ఎఫ్‌2 చిత్రంతో టాలీవుడ్ ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంది. ప్ర‌స్తుతం గోపిచంద్ హీరోగా న‌టిస్తున్న యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌ చాణ‌క్య‌లో క‌థానాయిక‌గా న‌టిస్తుంది మెహ‌రీన్. అయితే నెంజిల్ తునివ‌రుంద‌ల్ చిత్రంతో తమిళంలోకి ఎంట్రీ ఇచ్చిన మెహ‌రీన్ ప్ర‌స్తుతం త‌మిళంలో ధ‌నుష్ స‌ర‌స‌న క‌థానాయిక‌గా న‌టిస్తుంది. ఈ చిత్రంతో కోలీవుడ్‌లో మ‌రోసారి త‌న అదృష్టాన్ని ప‌రీక్షించుకుంటుంది. ఈ సినిమా కోసం మెహ‌రీన్ చాణ‌క్య సినిమా సెట్‌లో రోజుకి నాలుగు నుండి ఐదు త‌మిళ ప‌దాలు నేర్చుకుంటుంద‌ట‌. ద‌ర్శ‌కుడు తిరు మెహ‌రీన్‌కి త‌మిళ పాఠాలు నేర్పిస్తున్నాడ‌ట. మ‌రి ధ‌నుష్ చిత్రంతోనైన మెహ‌రీన్‌కి మంచి రోజులు వ‌స్తాయా అన్న‌ది చూడాలి.

1657
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles