ఛార్మి మ‌రో ఇంట్రెస్టింగ్ ట్వీట్‌

Sat,February 24, 2018 10:17 AM
MEHBOOBA shooting completed

పంజాబీ బ్యూటీ ఛార్మి ఈ మ‌ధ్య త‌న ట్విట్ట‌ర్‌లో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. న‌టిగా కాస్త గ్యాప్ తీసుకున్న ఈ అమ్మ‌డు పూరీ జ‌గ‌న్నాథ్ సినిమాల‌కి సంబంధించి ప్రొడ‌క్ష‌న్ ప‌నులు చూసుకుంటుంది. ఎప్ప‌టిక‌ప్పుడు సినిమా అప్‌డేట్స్ త‌న ట్విట్ట‌ర్ ద్వారా అందిస్తూ అభిమానుల‌కి ఆనందాన్ని క‌లుగ‌జేస్తుంది. తాజాగా త‌న ట్విట్ట‌ర్‌లో మెహ‌బూబా చిత్ర షూటింగ్ పూర్తైంద‌ని తెలియ‌జేస్తూ, లొకేష‌న్‌లో టీం అంద‌రితో క‌లిసి దిగిన ఫోటోస్‌ని షేర్ చేసింది. పూరీ త‌న‌యుడు ఆకాశ్ హీరోగా మెహ‌బూబా అనే చిత్రం తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. హిమాచ‌ల్ ప్ర‌దేశ్, పంజాబ్‌, హ‌ర్యానా, రాజ‌స్థాన్, హైద‌రాబాద్‌ల‌లో మూవీ చిత్రీక‌ర‌ణ జ‌రుపుకుంది. 1971లో జరిగిన ఇండో పాక్ యుద్ధం నేపథ్యంలో పూరీ జ‌గ‌న్నాథ్ ఈ చిత్రాన్ని ల‌వ్ వార్ డ్రామాగా రూపొందించిన‌ట్టు స‌మాచారం. మంగళూరు అమ్మాయి నేహా శెట్టి ఇందులో హీరోయిన్ గా నటిస్తుంది. ఇటీవ‌ల చిత్రానికి సంబంధించి టీజ‌ర్ విడుద‌ల కాగా, టీజ‌ర్‌లో పూరి మార్క్ స్ప‌ష్టంగా క‌నిపించింది. ఇంటెన్స్ రొమాంటిక్ డ్రామాగా పూరీ ఈ సినిమాని రూపొందించాడ‌ని టాక్. సందీప్ చౌతా చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. త్వ‌ర‌లోనే మూవీ విడుద‌లకి ప్లాన్ చేస్తున్నారు నిర్మాత‌లు.


1296
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS