ఆకాశ్ పూరీ కొత్త సినిమా టైటిల్, ఫస్ట్‌లుక్..!

Mon,February 11, 2019 03:25 PM
Mehbooba actor Akash Puri's new film announced

హైదరాబాద్: టాలీవుడ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తనయుడు ఆకాశ్ పూరీ మూడో సినిమాను ఇవాళ లాంఛనంగా ప్రారంభించారు. ఈ చిత్రానికి 'రొమాంటిక్' అనే టైటిల్‌ను ఫిక్స్ చేస్తూ చిత్ర బృందం టైటిల్, ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసింది. ఈ సినిమాకు పూరి జగన్నాథ్ స్క్రీన్‌ప్లే, డైలాగులు, స్టోరీ అందించనుండగా.. రొమాంటిక్, బ్యూటిఫుల్ లవ్ స్టోరీకి అనిల్ పాడూరి దర్శకత్వం వహిస్తారు. పూరీ జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరీ కనెక్ట్స్ బ్యానర్స్‌పై పూరీ, ఛార్మి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ చిత్రానికి పూరీ జగన్నాథ్ కథ సమకూర్చడమే గాక.. స్క్రీన్‌ప్లే, చిత్ర నిర్మాణం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోనున్నారు. విభిన్న ప్రేమ కథతో చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి హీరో నందమూరి కల్యాణ్ రామ్, సీనియర్ నటీ రమా ప్రభ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఫస్ట్ సీన్‌కి కల్యాణ్ క్లాప్ కొట్టారు. మెహబూబా సినిమాతో ఆకాశ్ మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న విష‌యం తెలిసిందే.


2096
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles