చిరు చిన్న అల్లుడి స‌ర‌స‌న నితిన్ బ్యూటీ..!

Fri,January 12, 2018 11:14 AM
megha selected heroine for kalyan movie

మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ భ‌ర్త కళ్యాణ్ త్వ‌ర‌లోనే వెండితెర ఆరంగేట్రం చేయ‌నున్న సంగ‌తి తెలిసిందే. జ‌త‌క‌లిసే ద‌ర్శ‌కుడు రాకేశ్ శ‌శి ఈ మూవీని డైరెక్ట్ చేయ‌నుండ‌గా, సాయి కొర్ర‌పాటి నిర్మించ‌నున్నారు. ఇప్ప‌టికే ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించి ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు స్టార్ట్ అయ్యాయ‌ని తెలుస్తుండ‌గా, ఫిబ్ర‌వ‌రిలో సెట్స్ పైకి తీసుకెళ్ళాల‌ని భావిస్తున్నార‌ట‌. అయితే ఈ సినిమాకి భారీ ప్ర‌చారం చేయ‌కుండా, జ‌నాల‌లోకి ఈజీగా వెళ్ళేలా మూవీ టీం ప్లాన్ చేస్తుంద‌ట‌. అయితే కొద్ది రోజులుగా క‌ళ్యాణ్ స‌ర‌స‌న ఎవ‌రు జ‌త‌క‌డ‌తారు అనే దానిపై జోరుగా చర్చ‌లు న‌డుస్తున్నాయి. మొన్నామ‌ధ్య ప్రేమ‌మ్ చిత్రంతో ఫుల్ ఫేమ్ అయిన అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌ని క‌థానాయిక‌గా తీసుకోవాల‌ని భావిస్తున్నారంటూ వార్త‌లు వ‌చ్చిన సంగతి తెలిసిందే. తాజా స‌మాచారం ప్ర‌కారం లై సినిమా ద్వారా క‌థానాయిక‌గా ప‌రిచ‌య‌మై కృష్ణ చైత‌న్య ద‌ర్శ‌క‌త్వంలో నితిన్ హీరోగా తెర‌కెక్కుతున్న మూవీతో పాటు ప‌లు త‌మిళ సినిమాల‌లో చేస్తున్న మేఘా ఆకాశ్ ని క‌ళ్యాణ్ సినిమాలో క‌థానాయిక‌గా తీసుకోవాల‌నుకుంటున్నార‌ట‌. అందం, అభినయం ఉన్న ఈ న‌టి క‌ళ్యాణ్‌కి క‌రెక్ట్ స‌రిపోతుంద‌ని టీం భావించిన‌ట్టు తెలుస్తుంది. దీనిపై క్లారిటీ రావ‌ల‌సి ఉంది. ఇక క‌ళ్యాణ్‌ ఇప్ప‌టికే ప్ర‌ముఖ ట్రైన‌ర్ స‌త్యానంద్ ద‌గ్గ‌ర న‌ట‌న‌లో శిక్ష‌ణ తీసుకున్నాడ‌ని తెలుస్తుండగా, మార్ష‌ల్ ఆర్ట్స్, డ్యాన్స్ కోసం విదేశాల‌లో ఉన్న‌ట్టు స‌మాచారం.

2878
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles