తమిళ అర్జున్‌రెడ్డికి ప్రేయ‌సి దొరికింది

Thu,July 5, 2018 03:29 PM
megha chowdary selected heroine for varma movie

చియాన్ విక్రమ్ తనయుడు ధృవ్ హీరోగా అర్జున్ రెడ్డి తమిళ రీమేక్ .. వర్మ టైటిల్ తో రూపొందుతున్న సంగతి తెలిసిందే. బోల్డ్ కంటెంట్ తో సహజత్వ ప్రేమకథగా తమిళంలో రూపొందుతున్న ఈ సినిమాని బాల తెరకెక్కిస్తున్నాడు. నేషనల్ అవార్డు విన్నర్ రాజు మురుగున్ చిత్రానికి డైలాగ్స్ రాస్తున్నాడు. తెలుగులో అర్జున్ రెడ్డి చిత్రం భారీ విజయం సాధించడంతో తమిళంలోను ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. ఆ మధ్య అర్జున్ రెడ్డి గెటప్ లో ధృవ్ లుక్ ఒకటి బయటకి రాగా, ఇది అభిమానులని ఎంతగానో అలరించింది. ఇక ఈ చిత్రంలో ముఖ్య పాత్ర కోసం ఈశ్వరీరావుని ఎంపిక చేసినట్టు తెలుస్తుంది.

వర్మ మూవీలో కథానాయిక ఎవరనే దానిపై అభిమానులలో చాలా ఆసక్తి నెలకొంది. రీసెంట్ గా వర్మ చిత్రంలో ధృవ్ సరసన శ్రీయా శర్మని కథానాయికగా ఎంపిక చేసినట్టు వార్తలు వచ్చాయి. కాని అవి అబద్ధం తేలిపోయింది. ధృవ్ తండ్రి విక్రమ్ తన తనయుడి సినిమాలో కథానాయికగా కోల్ కతాకి చెందిన మేఘ చౌదరిని ఎంపిక చేసినట్టు తెలిపాడు. ఇప్పటి వరకు హీరోకి సంబంధించిన సన్నివేశాలు మాత్రమే తెరకెక్కించిన దర్శకుడు ఇప్పుడు మేఘకి సంబంధించిన సీన్స్ కోసం మూడు వారాల పాటు వర్క్ షాప్స్ కూడా నిర్వహిస్తున్నారట. ఈ అమ్మడు తెలుగులోను ఓ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని సమాచారం. అయితే అర్జున్ రెడ్డి తెలుగులో బోల్డ్ కంటెంట్ తో సహజత్వ ప్రేమ కథగా రూపొందగా, తమిళంలో ఈ మూవీని బాల ఎలా రీమేక్ చేస్తాడో చూడాలి.

2816
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles