HomeLATEST NEWSMegha Akash joins Thalaivar Superstar Rajinikanth petta

ర‌జ‌నీకాంత్ చిత్రంలో నితిన్ భామ‌

Published: Thu,September 27, 2018 08:59 AM
  Increase Font Size Reset Font Size decrease Font size   
నితిన్ న‌టించిన‌ లై చిత్రంతో తెలుగు తెర‌కి ప‌రిచ‌య‌మైన అందాల భామ మేఘా ఆకాశ్‌. ఈ అమ్మ‌డు ప‌లు తమిళ సినిమాలు చేసింది. నితిన్ స‌ర‌స‌న ఛ‌ల్ మోహ‌న్ రంగా అనే సినిమా కూడా చేసింది. అయితే ఈ అమ్మ‌డికి గోల్డెన్ ఛాన్స్ ద‌క్కింది. సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ త‌న 165వ చిత్రంగా పేటా అనే చిత్రం చేస్తుండ‌గా ఇందులో విజయ్‌ సేతుపతి, సిమ్రన్‌, నవాజుద్దీన్‌ సిద్ధిఖీ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. చిక్కడు దొరకడు, పిజ్జా తోపాటు పలు హిట్ చిత్రాలను తీసిన కార్తీక్ సుబ్బరాజ్ ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నాడు. ఈ చిత్రంలో మేఘా ఆకాశ్‌కి ఛాన్స్ రావ‌డంతో అమ్మ‌డి ఆనందానికి అవ‌ధులు లేకుండా పోయాయి. మ‌రి మేఘా ఆకాశ్‌ని ఏ పాత్ర‌కి ఎంపిక చేశార‌నేది తెలియాల్సి ఉంది. చిత్రంలో ర‌జ‌నీకాంత్ స‌ర‌స‌న త్రిష క‌థానాయిక‌గా న‌టిస్తుంది. కళానిధిమారన్ సమర్పణలో మమ్మోత్ ప్రొడక్షన్ కంపెనీ ఈ మూవీని నిర్మిస్తుంది. త్వ‌ర‌లోనే చిత్ర టీజ‌ర్ విడుద‌ల‌కి ప్లాన్ చేస్తున్నారు మేక‌ర్స్.
2385
Tags

More News

NATIONAL-INTERNATIONAL

SPORTS

Health

Technology