అత్తారింటికి దారేది త‌మిళ రీమేక్‌లో నితిన్ హీరోయిన్‌!

Wed,September 5, 2018 12:43 PM

పవన్‌కల్యాణ్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తెర‌కెక్కిన బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రం ‘అత్తారింటికి దారేది’ . ఈ సినిమా పవన్‌కల్యాణ్ కెరీర్‌లోనే మంచి హిట్ చిత్రంగా నిలిచింది. ఇపుడు ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ తమిళంలో రీమేక్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. సుంద‌ర్ సి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌నున్న ఈ రీమేక్ చిత్రంలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ పాత్ర‌లో శింబు న‌టించ‌నుండ‌గా, ఆయ‌నకి జోడీగా మేఘా ఆకాశ్ న‌టించ‌నుంద‌ని స‌మాచారం. నితిన్ న‌టించిన లై, ఛ‌ల్ మోహ‌న రంగా చిత్రాల‌లో క‌థానాయిక‌గా న‌టించిన ఈ అమ్మ‌డు తెలుగు ప్రేక్ష‌కుల‌ని అల‌రించింది. ధనుష్‌కు జంటగా ‘ఎన్నై నోక్కి పాయుం తూటా’ చిత్రంతోపాటు ఒరు పక్క కథై, అధర్వకు జతగా బూమరాంగ్‌ చిత్రాలలో నటిస్తోంది. స‌మంత పాత్ర‌ని మేఘా ఆకాశ్ చేస్తుంద‌ని తెలుస్తుండగా, ప్ర‌ణీత పాత్ర‌పై క్లారిటీ రావ‌ల‌సి ఉంది. ఇక శింబు ప్ర‌స్తుతం మ‌ణిర‌త్నం ద‌ర్శ‌క‌త్వంలో ‘సెక్క సివంద వానం’ (తెలుగులో నవాబ్‌) అనే చిత్రం చేస్తున్నాడు. ఈ చిత్రంతో పాటు దర్శకుడు వెంకట్‌ప్రభు దర్శకత్వంలో మానాడు అనే చిత్రం, గౌతమ్‌మీనన్‌ దర్శకత్వంలో విన్నైతాండి వరువాయా- 2 చిత్రాలలో నటించేందుకు సిద్ధ‌మ‌య్యాడు. అత్తారింటికి దారేది రీమేక్ చిత్రం అతి త్వ‌ర‌లోనే సెట్స్ పైకి వెళ్ళ‌నుంది.

2850
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles