త‌న ఇన్‌స్టాగ్రామ్ హ్యాక్ అయింద‌ని ట్వీట్ చేసిన హీరోయిన్

Tue,February 5, 2019 10:52 AM
Megha Akash Instagram Handle Got Hacked

2017లో లై సినిమాతో తెలుగు తెర‌కి ప‌రిచ‌య‌మైన అందాల భామ మేఘా ఆకాశ్. ఈ చిత్రం త‌ర్వాత చ‌ల్ మోహ‌న రంగా, పేటా, వంత రాజ‌వ‌తన్ వ‌రువెన్ అనే చిత్రాలు చేసింది. ఇందులో ఏ ఒక్క చిత్రం కూడా మంచి విజ‌యం సాధించ‌క‌పోవ‌డంతో అమ్మ‌డికి అవ‌కాశాలు క‌రువ‌య్యాయి. అయితే ప్ర‌స్తుతం ఈ అమ్మ‌డి ఇన్‌స్టాగ్రామ్ హ్యాక్ అయింది. ఈ విష‌యాన్ని త‌న ట్విట్టర్ ద్వారా తెలియ‌జేసింది. అభిమానులు నా ఎకౌంట్ నుండి అస‌భ్య‌క‌ర మెసేజ్‌లు ఎవైన వ‌స్తే విస్మ‌రించండి . ప్ర‌స్తుతం నా టీం దీనిపై వ‌ర్క్ చేస్తుంది అని మేఘా ఆకాశ్ తెలిపింది. అతి త్వ‌ర‌లోనే నా ఎకౌంట్ మ‌ళ్ళీ రిక‌వ‌ర్ అవుతుంద‌ని కూడా త‌న ట్వీట్‌లో పేర్కొంది. సినిమాల విష‌యానికి వ‌స్తే విక్ర‌మ్ కుమార్- నాని కాంబినేష‌న్‌లో తెర‌కెక్క‌నున్న చిత్రంలో మేఘా ఆకాశ్ ఓ క‌థానాయిక‌గా ఎంపికైన‌ట్టు తెలుస్తుంది. త్వ‌ర‌లోనే దీనిపై క్లారిటీ రానుంది.


2636
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles