మేఘా ఆకాశ్‌కి వ‌రుస ఆఫర్స్‌

Fri,March 30, 2018 12:20 PM
Megha Akash Grabs One More offer in tolywood

ఈ మ‌ధ్య కాలంలో కొంద‌రు భామ‌ల‌ని అదృష్టం ఇట్టే వరిస్తూ వ‌స్తుంది. ఒక్క సినిమాతోనే ప‌లు ఆఫ‌ర్స్ వారి వెనుక క్యూ క‌డుతున్నాయి. లై చిత్రంతో తెలుగు తెర‌కి ప‌రిచ‌య‌మైన అందాల భామ మేఘా ఆకాశ్‌. ఈ అమ్మ‌డు ప‌లు తమిళ సినిమాలు చేసింది. ఏప్రిల్ 5న ఛ‌ల్ మోహ‌న్ రంగా సినిమాతో మ‌రోసారి తెలుగు ప్రేక్ష‌కుల‌ని అల‌రించ‌నుంది. అయితే ఈ అమ్మ‌డిని క‌థానాయిక‌గా తీసుకోవాలని ప‌లువురు ద‌ర్శ‌కులు భావిస్తున్నార‌ట‌. వెంకీ అట్లూరి త్వ‌ర‌లో అఖిల్ హీరోగా ఓ మూవీ చేయ‌నున్నాడు. ఇందులో మేఘానే క‌థానాయిక‌గా తీసుకోవాల‌ని అనుకుంటున్నార‌ట‌. ఇక ప్ర‌స్తుతం క‌రుణాక‌ర‌ణ్ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేస్తున్న సాయిధ‌ర‌మ్ తేజ్ త్వ‌ర‌లో కిషోర్ తిరుమ‌ల ద‌ర్శ‌క‌త్వంలో ఓ క్రేజీ ప్రాజెక్ట్ చేయ‌నున్నాడ‌ట‌. ఇందులో క‌థానాయిక‌గా మేఘాని తీసుకోవాల‌ని భావిస్తున్నార‌ట‌. గౌత‌మ్ మీన‌న్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న సినిమాలోను మేఘా క‌థానాయిక‌గా న‌టిస్తుంది. ఎనై నొక్కి పాయుమ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో ధ‌నుష్ హీరోగా న‌టిస్తున్నాడు. ఏదేమైన షార్ట్ టైంలో మేఘా ఆకాశ్ ప‌లు ఆఫ‌ర్స్ అందుకోవ‌డం గొప్ప విశేష‌మే.

2448
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles