నితిన్ తో పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన మేఘా ఆకాశ్

Tue,October 31, 2017 04:47 PM
megha akash gives clarity on their rumors

కొంత కాలంగా హీరో హీరోయిన్స్ కి ఎఫైర్స్ పెట్టేసి త్వరలో వివాహం చేసుకోబోతున్నారంటూ ప్రచారం చేయడం చూస్తూనే ఉన్నాం. ఇటీవల లవర్ బోయ్ నితిన్ లై మూవీ హీరోయిన్ చాలా క్లోజ్ గా ఉంటున్నాడని వారిరివురు కలిసి వివాహం చేసుకోనున్నారని పుకార్లు షికార్లు చేశాయి. లై చిత్ర షూటింగ్ సమయంలోనే వారి మధ్య ప్రేమ పుట్టిందని కూడా అన్నారు. ఈ వార్తలపై తాజాగా మేఘా ఆకాశ్ స్పందించింది. నాకు, నితిన్ కి ప్రేమ ఉందనేది అసత్యం. మాపై వస్తున్న వార్తలన్నీ అవాస్తవాలే అని క్లారిటీ ఇచ్చింది. అయితే నితిన్ , మేఘా ఆకాశ్ లపై ఇలాంటి ప్రచారం జరగడానికి కారణం లై సినిమాలో ఆమెను హీరోయిన్ గా తీసుకోమని డైరెక్టర్ హనూ రాఘవపుడికి నితిన్ రికమండ్ చేయడమేనట . దాని వలనే ఈ వార్తకు మరింత స్ట్రెంత్ పెరిగిందని టాక్. అంతేకాదు నితిన్ తో ప్రేమ వ్యవహారం నడుస్తుండటం వలనే మేఘా సినిమాలు ఒప్పుకోలేదని అన్నారు. ఉన్నది ఒకటే జిందగీలో అవకాశం వచ్చినా రిజక్ట్ చేసిందని అన్నారు. కాని దానికి కారణం వేరే సినిమాకి డేట్స్ అడ్జెస్ట్ చేయడం వలననే అని అంటుంది మేఘా. దయచేసి నాపై తప్పుడు ప్రచారం చేయోద్దని కోరింది మేఘా. ప్రస్తుతం నితిన్తో కలిసి మరో చిత్రంలో నటిస్తున్నది. ఈ చిత్రానికి ఇంకా టైటిల్ కన్ఫార్మ్ చేయలేదు.

6800
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles