నానికి మెగాస్టార్ సపోర్ట్

Sun,September 4, 2016 12:00 PM
megastar guest for MAJNU

నాని, అన్ను ఇమ్మాన్యూల్, ప్రియా శ్రీ లు ప్రధాన పాత్రలుగా విరించి వర్మ తెరకెక్కించిన చిత్రం ‘మజ్ను’. ఆనంది ఆర్ట్‌ క్రియేషన్స్‌, కేవా మూవీస్‌ పతాకాలపై రూపొందుతున్న యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ ‘మజ్ను’ చిత్ర ఆడియో వేడుక ఈ నెల 4న జరపాలని యూనిట్ బావించగా, ఈ వేడుకకి ముఖ్య అతిధి ఎవరనే దానిపై షాకింగ్ వార్త బయటకు వచ్చింది. ఇన్నాళ్ళు మెగా ఫంక్షన్ లకు మాత్రమే ముఖ్య అతిధిగా హాజరైన చిరు మజ్ను చిత్రానికి గెస్ట్ గా హాజరు కాబోతున్నట్టు తెలుస్తోంది. చిత్ర నిర్మాత జెమిని కిరణ్ స్పెషల్ రిక్వెస్ట్ పై చిరు ఈ వేడుకకు హాజరవుతున్నారని సమాచారం. గతంలో సునీల్ మూవీ జక్కన్న ఆడియో వేడుకకి కూడా చిరు గెస్ట్ గా హాజరయ్యారు.

మజ్ను చిత్రానికి సంబంధించి ఇప్పటికే ‘కళ్ళు మూసి తెరిచే లోపే.. గుండెలోకే చేరావే..’ అంటూ సాగే మొదటి పాటను రేడియో మిర్చి ద్వారా, ‘ఓయ్‌.. మేఘమాల..’ అంటూ సాగే రెండో పాటను రెడ్‌ ఎఫ్‌.ఎం. ద్వారా రిలీజ్‌ చేశారు. వీటికి మంచి రెస్పాన్స్ వచ్చింది. లహరి మ్యూజిక్‌ ద్వారా విడుదల కానున్న మిగతా పాటలపై అభిమానుల్లో చాలా ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుగుతోండగా త్వరలోనే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి సెప్టెంబర్‌లోనే చిత్రాన్ని వరల్డ్‌ వైడ్‌గా రిలీజ్‌ చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు.

2716
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles