'నిత్య నూత‌నం'గా చిరు మ‌న‌వ‌రాలి పేరు

Sun,January 20, 2019 07:24 AM
megastar Chiranjeevi  grand daughter name is NAVISHKA

మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ క్రిస్మస్ ప‌ర్వ‌దినం రోజు పండంటి ఆడ‌బిడ్డ‌కి జ‌న్మ‌నిచ్చిన సంగ‌తి తెలిసిందే. శ్రీజ భ‌ర్త క‌ళ్యాణ్ దేవ్ త‌న ట్విట్ట‌ర్‌లో తన కూతురి పాద ముద్ర ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ .. ‘2018 క్రిస్మస్‌ మాకు జీవితాంతం గుర్తుండి పోతుంది. ఆడపిల్ల పుట్టింది. అందరికీ క్రిస్మస్‌ శుభాకాంక్షలు’ అంటూ క్యాప్షన్‌ పెట్టాడు . ఇక తాజాగా ‘మా చిన్నారికి నవిష్క అని పేరు పెట్టాం’ అంటూ కల్యాణ్‌దేవ్‌ సోషల్‌ మీడియాల ఈ విషయాన్ని పేర్కొన్నారు. శుక్రవారం ఈ నామకరణ వేడుక జరిగింది. ‘నవిష్క’ అంటే నిత్య నూతనం అని అర్థం అట. విజేత చిత్రంతో హీరోగా మెరిసిన కళ్యాణ్‌ దేవ్‌..ప్రస్తుతం రెండో సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రానికి పులి వాసు దర్శకుడు. ఎస్‌.ఎస్‌. తమన్‌ సంగీత స్వరాలు సమకూర్చనున్నాడు. రిజ్వాన్‌ ఎంటర్‌టైన్మెంట్‌ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

4217
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles