మత్తు వదలరా.. టీజర్‌ను విడుదల చేసిన మెగా పవర్‌స్టార్

Sat,December 7, 2019 06:01 PM

నూతన దర్శకుడు రితేష్ దర్శకత్వం వహించిన మత్తువదలరా.. సినిమా టీజర్ ను మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ విడుదల చేశారు. ప్రముఖ నిర్మాణ సంస్థలు మైత్రీ మూవీ మేకర్స్, క్లాప్ ఎంటర్ టైన్ మెంట్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించాయి. చిరంజీవి (చెర్రీ), హేమలత నిర్మాతలు. కాగా, ఈ చిత్రం ద్వారా ప్రముఖ సంగీత దిగ్గజం ఎమ్.ఎమ్.కీరవాణి చిన్న కుమారుడు శ్రీసింహా హీరోగా పరిచయం అవుతుండగా, కీరవాణి పెద్ద కుమారుడు కాలభైరవ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ సందర్భంగా చరణ్ మాట్లాడుతూ.. కొత్తదనంతో కూడిన కథ, కథనాలతో వచ్చే సినిమాలను తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తుంటారు. ఆ నమ్మకంతోనే మరో యంగ్ టాలెంటెడ్ టీమ్ తో మత్తు వదలరా అనే సినిమా చేస్తున్నారని, ఈ సందర్భంగా వారికి శుభాకాంక్షలు అని ఆయన తెలిపారు. ఇటీవల ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ను యంగ్‌టైగర్ ఎన్టీఆర్ విడుదల చేసిన విషయం తెలిసిందే.


ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ.. యంగ్ టాలెంట్‌ను ప్రోత్సాహించాలనే ఉద్దేశంతో నిర్మించిన చిత్రమిది. ఆద్యంతం ఆసక్తికరమైన కథ, కథనాలతో చిత్రం వుంటుంది. హాస్యంతో కూడిన మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ ఇది. ఈ చిత్రం ద్వారా ఎంతో మంది నటీనటులతో పాటు సాంకేతిక నిపుణులు కూడా తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం కాబోతున్నారు. ఈ నెల 25న చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం అని నిర్మాతలు తెలిపారు. చిత్రంలో నరేష్ ఆగస్త్య, అతల్య చంద్ర, సత్య, వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ తదితరులు నటిస్తున్నారు.

1088
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles