ఇస్మార్ట్ శంక‌ర్‌పై ప్ర‌శంస‌లు కురిపించిన రామ్ చ‌ర‌ణ్‌

Fri,July 26, 2019 08:56 AM
Mega Powerstar Ram Charan about iSmart Shankar

ప్ర‌స్తుతం బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ప్ర‌భంజ‌నం సృష్టిస్తున్న చిత్రం ఇస్మార్ట్ శంక‌ర్ . జూలై 18న విడుద‌లైన ఈ చిత్రం స‌రిగ్గా ఆరు రోజుల్లో 56 కోట్ల గ్రాస్ వ‌సూళ్ళ‌ని రాబ‌ట్టింది. వీకెండ్‌లోనే కాదు మాములు రోజుల‌లోను ఈ చిత్రంకి ప్రేక్ష‌కాద‌ర‌ణ మ‌రింత పెరుగుతూ పోతుంది. కొన్ని చోట్ల ఇప్ప‌టికి హౌజ్‌ఫుల్ బోర్డ్స్ ద‌ర్శ‌న‌మిస్తున్నాయి. పూరీ మ్యాజిక్, రామ్ ప‌ర్‌ఫార్మెన్స్‌కి ప్రేక్ష‌కులు ఫిదా అయ్యారు. చూసిన వారే మ‌ళ్ళీ మ‌ళ్ళీ థియేట‌ర్స్‌కి వెళుతుండ‌డం విశేషం. చాలా రోజుల త‌ర్వాత మాంచి మ‌సాలా ఎంట‌ర్‌టైన‌ర్ ప్రేక్ష‌కుల ముందుకు రావ‌డంతో దీనిని ప్రేక్ష‌కులు బాగా ఆద‌రిస్తున్నారు. తాజాగా చిత్రాన్ని వీక్షించిన రామ్ చ‌రణ్ త‌న ఫేస్ బుక్ వేదిక‌గా మూవీపై ప్రశంస‌లు కురిపించాడు. రామ్‌తో పాటు మిగ‌తా న‌టీన‌టులు చాలా ఎన‌ర్జిటిక్ న‌ట‌న క‌న‌బ‌ర‌చారు. పూరీ గారికి అభినంద‌న‌లు. ఈ సినిమా కోసం ఆయ‌న ఎంతో చేశారు అని చెర్రీ త‌న పోస్ట్‌లో తెలిపాడు. దీనికి పూరీ జ‌గ‌న్నాథ్ ‘లవ్ యు చరణ్’ అంటూ ధన్యవాదాలు తెలిపారు. ఇక సుమంత్ కూడా సినిమా టీం అభినందిస్తూ.. చాలా ఆనందంగా ఉంద‌ని పేర్కొన్నాడు. ఈ చిత్రానికి మెలోడీ బ్ర‌హ్మ మ‌ణిశ‌ర్మ సంగీతం అందించగా పూరీ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. నిధి అగర్వాల్,నభా నటేష్ ప్రధాన హీరో హీరోయిన్లుగా నటించారు. పూరి జ‌గ‌న్నాథ్ టూరింగ్ టాకీస్‌, పూరి కనెక్ట్స్ బ్యానర్‌పై రూపొందిన ఈ చిత్రంలో పునీత్ ఇస్సార్‌, స‌త్య‌దేవ్‌, ఆశిష్ విద్యార్థి, గెట‌ప్ శ్రీను, సుధాంశు పాండే త‌దిత‌రులు ప్రధాన పాత్రల్లో నటించారు.


1907
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles