మెగా హీరోల స‌మక్షంలో చిరు 63వ బ‌ర్త్‌డే సెల‌బ్రేష‌న్స్

Wed,August 22, 2018 09:14 AM
mega heroes in chiru birthday celebrations

మెగాస్టార్ చిరంజీవి బ‌ర్త్‌డే సెల‌బ్రేష‌న్స్ ఘ‌నంగా జ‌రుగుతున్నాయి. బ‌ర్త్‌డేకి ఒక్క రోజు ముందుగానే సైరా టీజ‌ర్ విడుద‌ల చేసి అభిమానుల‌లో నూత‌నుత్తేజం తెచ్చారు రామ్ చ‌ర‌ణ్‌. ఇక నిన్న సాయంత్రం హైదరాబాద్‌లోని శిల్ప కళావేదికలో 'బర్త్ డే సెలబ్రేషన్స్‌ ఆఫ్ మెగాస్టార్' పేరిట ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్య‌క్ర‌మానికి అభిమానులు భారీగా హాజ‌ర‌య్యారు. మెగా హీరోలు రామ్ చ‌ర‌ణ్‌, అల్లు అర్జున్‌, వ‌రుణ్ తేజ్ తో పాటు అల్లు అరవింద్ , నాగేంద్ర బాబు ,హీరో సునీల్, పరుచూరి బ్రదర్స్‌, ఉత్తేజ్ త‌దితరులు హాజ‌ర‌య్యారు. ప‌లు కార్య‌క్ర‌మాల‌తో సంద‌డి జ‌రిగిన ఈ ఈవెంట్ లో బ‌న్నీ, చెర్రీలు చిరు నుండి ముందుగా మాన‌వ‌త్వ‌పు విలువలు నేర్చుకోవ‌లసి ఉందని అన్నారు. ఇక ఇదే కార్య‌క్ర‌మంలో అల్లు అర్జున్‌, అరవింద్‌లు కామెడీ హీరో సునీల్‌ని అల్లు రామ‌లింగ‌య్య అవార్డుతో స‌త్క‌రించారు.

చిరు బ‌ర్త్‌డే గిఫ్ట్‌గా విడుద‌లైన సైరా టీజ‌ర్‌ని ముందుగా చూసింది ప‌వ‌న్ క‌ళ్యాణ్ అని చ‌ర‌ణ్ ఈ వేడుక‌లో తెలియ‌జేశారు. 11.30ని.ల‌కు అఫీషియ‌ల్‌గా విడుద‌లైన టీజ‌ర్‌ని ప‌ద‌కొండు గంట‌ల‌కి ప‌వ‌న్ చూశార‌ని, టీజ‌ర్ అదిరిపోయిందని చెప్పార‌ని చెర్రీ చెప్పుకొచ్చారు. సినిమా కోసం ప‌వ‌న్ ఎంతో ఆస‌క్తితో ఎదురు చూస్తున్నార‌ని కూడా పేర్కొన్నారు. చిరు 151వ చిత్రంగా విడుద‌లైన సైరా చిత్రం అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా భారీ బ‌డ్జెట్‌తో రూపొందుతుంది. సైరా టీజ‌ర్ విడుద‌లైన కొన్ని గంట‌ల‌లో రికార్డు వ్యూస్ సాధించి సినిమాపై అభిమానుల‌లో ఎంత ఆస‌క్తి ఉంద‌నేది తెలియ‌జేస్తుంది.


3230
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS