ఈ సారి నాగ‌శౌర్య‌తో మెగా హీరో మ‌ల్టీ స్టార‌ర్..!

Wed,January 23, 2019 10:21 AM

ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో మ‌ల్టీ స్టార‌ర్ ట్రెండ్ ఊపందుకుంది. స్టార్ హీరోలు కుర్ర హీరోల‌తో క‌లిసి మ‌ల్టీ స్టార‌ర్ సినిమాలు చేస్తూ మంచి విజ‌యం సాధిస్తున్నారు. ఈ క్ర‌మంలో వ‌రుస మ‌ల్టీ స్టార‌ర్ చిత్రాలు ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్నాయి. ఇటీవ‌ల వెంక‌టేష్‌, వ‌రుణ్ తేజ్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కిన ఎఫ్‌2 అనే మ‌ల్టీ స్టార‌ర్ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రాగా, ఈ చిత్రానికి భారీ ఆద‌ర‌ణ ల‌బించింది. వెంకీ, వ‌రుణ్‌లు తోడ‌ళ్ళులుగా ప్రేక్ష‌కుల‌ని క‌డుపుబ్బ న‌వ్వించారు. అయితే ఇప్పుడు వ‌రుణ్ తేజ్ మ‌రో మ‌ల్టీ స్టార‌ర్ చేసేందుకు సిద్ధ‌మైన‌ట్టు తెలుస్తుంది.


డీజే చిత్రం త‌ర్వాత ఏ ఒక్క సినిమాని ప‌ట్టాలెక్కించ‌ని హ‌రీష్ శంక‌ర్ త్వ‌ర‌లో కోలీవుడ్ సూప‌ర్ హిట్ మూవీ జిగ‌ర్తాండ్రా చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయ‌బోతున్నాడ‌ట‌. థ్రిల్లర్ నేపథ్యంలో సాగే ఈ చిత్రాన్ని ఏకే ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ నిర్మించ‌నుంద‌ట‌. త‌మిళంలో సిద్ధార్ధ్, బాబీ సింహాల పాత్ర‌ల‌ని తెలుగులో నాగ శౌర్య‌, వ‌రుణ్ తేజ్‌లు పోషించ‌నున్నార‌ని అంటున్నారు. తెలుగు నేటీవిటికి త‌గ్గ‌ట్టుగా హ‌రీష్ శంక‌ర్ స్క్రిప్ట్‌ని సిద్దం చేసుకోగా వ‌చ్చే నెల‌లో ఈ ప్రాజెక్ట్‌ సెట్స్ పైకి వెళ్ల‌నుంద‌ట‌. చిత్ర తారాగ‌ణం, సాంకేతిక నిపుణులు త‌దిత‌ర వివరాలు త్వ‌ర‌లోనే అధికారికంగా ప్ర‌క‌టించ‌నున్నారు. జిగ‌ర్తాండ్రా చిత్రం కార్తీక్ సుబ్బ‌రాజు ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌గా, ఈ చిత్రం పలు జాతీయ అవార్డులను కూడా సొంతం చేసుకుంది.

2305
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles