మెగా ఫ్యామిలీ సెల్ఫీ అదుర్స్

Mon,November 13, 2017 11:32 AM
mega family selfie adhurs

మెగా ఫ్యామిలీలో తమ కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు నాగబాబు. ఆయన వారసులుగా వరుణ్ తేజ్ , నిహారిక కూడా ప్రేక్షకులని మెప్పిస్తూనే ఉన్నారు. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే వరుణ్ తేజ్ అప్పుడప్పుడు తన సినిమా విషయాలనే కాక పర్సనల్ విషయాలను కూడా అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటాడు. తాజాగా సండే లంచ్ విత్ ఫ్యామిలీ అంటూ తన కుటుంబ సభ్యులుతో కలిసి దిగిన ఫోటోని షేర్ చేశాడు. మెగా బ్రదర్ కుటుంబం చూడ ముచ్చటగా ఉందంటూ అభిమానులు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. అయితే ఈ సెల్ఫీలో ఇటు వరుణ్ తేజ్ , అటు నిహారిక డిఫరెంట్ లుక్ లో కనిపించడం విశేషం. వరుణ్ తేజ్ ప్రస్తుతం అట్లూరి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. రాశీఖన్నా ఈ చిత్రానికి కథానాయిక కాగా, థమన్ స్వరాలు అందిస్తున్నాడు. ఇక నిహారిక తమిళంలో ప్రభుదేవ దగ్గర అసిస్టెంట్ గా పనిచేసిన రవిదుర్గ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తుంది. ఈ మూవీతో పాటు ప్రముఖ నిర్మాణ సంస్థ యువీ క్రియేషన్స్ బ్యానర్లో రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా హ్యాపీ వెడ్డింగ్ అనే చిత్రం చేస్తుంది. సుమంత్ అశ్విన్, నిహారిక హీరో హీరోయిన్స్గా నటించనున్న ఈ చిత్రంకి రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నాడు. వీటితో పాటు నాన్న కూచి అనే వెబ్ సిరీస్ చేస్తుంది మెగా డాటర్ . ఇందులో నాగ బాబు .. నిహారికకి ఫాదర్ గా కనిపించడం గమనర్హం.

2362
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles