మెగా ఫ్యామిలీ రేర్ పిక్ షేర్ చేసిన వ‌రుణ్ తేజ్

Sat,May 11, 2019 08:38 AM

ప్ర‌స్తుతం మెగా ఫ్యామిలీ ఓ క్రికెట్ టీంలా మారిన సంగ‌తి తెలిసిందే. చిరంజీవి వేసిన బాట‌లో మెగా హీరోలు ఇండ‌స్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి త‌మ అదృష్టాన్ని ప‌రీక్షించుకున్నారు. నాగ బాబు , ప‌వ‌న్ కళ్యాణ్ , రామ్ చ‌ర‌ణ్‌, అల్లు అర్జున్ ,వరుణ్ తేజ్ , సాయి ధ‌ర‌మ్ తేజ్, అల్లు శిరీష్‌, నిహారిక, క‌ళ్యాణ్ దేవ్‌, వైష్ణ‌వ్ తేజ్ ఇలా మెగా ఫ్యామిలీకి చెందిన ప‌లువురు స్టార్స్ ఇండ‌స్ట్రీలో రాణిస్తూ అశేష అభిమానాన్ని చూర‌గొన్నారు. ఈ ఫ్యామిలీకి చెందిన ఫోటో ఏదైన బ‌య‌ట‌కి వ‌చ్చిందంటే అది సోష‌ల్ మీడియాలో ఫుల్ వైర‌ల్ అవుతుంది. రీసెంట్‌గా వ‌రుణ్ తేజ్ త‌న ట్విట్ట‌ర్‌లో పెద్ద‌నాన్న చిరంజీవి, బాబాయి ప‌వ‌న్ క‌ళ్యాణ్ ,తన తండ్రి నాగ‌బాబుతో చిన్న‌ప్పుడు దిగిన ఫోటోని షేర్ చేశాడు. ‘పాత ఫొటోల్లో నుంచి దీన్ని బయటికి తీశా. నాకు ఎంతో ఇష్టమైన వాళ్లతో.. వీరిని ఎంతో ప్రేమిస్తున్నా’ అని ట్వీట్‌ చేశారు. ఈ ఫొటోలో వరుణ్‌ను పవన్‌ తన భుజాలపై ఎత్తుకుని కనిపించారు. ఈ ఫోటో మెగా ఫ్యాన్స్‌ని ఆక‌ట్టుకుంటుంది. వ‌రుణ్ తేజ్ ప్ర‌స్తుతం వాల్మీకి అనే చిత్రంతో బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. తమిళ చిత్రం ‘జిగర్తాండ’కు రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే క‌థానాయిక‌. హ‌రీష్ శంకర్ డైరెక్ట్ చేస్తున్నారు

2294
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles