చెర్రీ- ఉపాసన వర్కవుట్ వీడియోపై ఓ లుక్కేయండి

Tue,July 17, 2018 05:28 PM
mega couple work out video goes viral

మెగా కపుల్ రామ్ చరణ్, ఉపాసనలు ఎంత అన్యోన్యయంగా ఉంటారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. టైం దొరికితే చాలు తన భర్తకి సంబంధించిన విషయాలని ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా అభిమానులకి చేరవేస్తుంటుంది ఉప్సీ. తాజాగా తన ట్విట్టర్ లో మిస్టర్ సి.. చాలా స్వీట్. ఏడు రోజుల ట్రాన్స్ ఫర్మేషన్ లో భాగంగా నన్ను ప్రోత్సహించేందుకు మిస్టర్ సి నాతో కలిసి వర్కవుట్ చేశారు అంటూ వర్కవుట్ కి సంబంధించిన వీడియోని తన ట్విట్టర్ లో పోస్ట్ చేసింది ఉపాసన. ప్రస్తుతం ఈ వీడియో మెగా ఫ్యాన్స్ ని అలరిస్తుంది. ఇక చెర్రీ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఆయన బోయపాటి శీను చిత్రంతో బిజీగా ఉన్నాడు. అక్టోబర్ లో రాజమౌళి మల్టీ స్టారర్ చిత్ర యూనిట్ తో కలవనున్నాడు. మరో వైపు తన తండ్రి చిరంజీవి ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న సైరా నిర్మాణ పనులలో భాగం అవుతూ వస్తున్నాడు.


2709
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles