త‌న కుమారుడిని ప‌రిచ‌యం చేసిన స్టార్ హీరో

Sun,November 11, 2018 06:58 AM
Meet Shahid Kapoor son Zain

బాలీవుడ్ హీరో షాహిద్ క‌పూర్ ఇంట బుధ‌వారం (సెప్టెంబ‌ర్ 5న‌) సాయంత్రం ఆనందం వెల్లివిరిసిన సంగ‌తి తెలిసిందే బుధవారం సాయంత్రం ముంబైలోని హిందుజా ఆస్పత్రిలో మీరా రాజ్‌పుత్‌ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. ఈ చిన్నారికి జైన్ క‌పూర్ అనే నామ‌క‌ర‌ణం చేశారు. తాజాగా ఆ బాబు ఫోటోని ప్ర‌పంచానికి ప‌రిచ‌యం చేసింది షాహిద్ భార్య మీరా క‌పూర్‌. హ‌లో వ‌ర‌ల్డ్ అంటూ క్యాప్ష‌న్ పెట్టి బుడ‌త‌డి ఫోటోని షేర్ చేయ‌డంతో అభిమానులు బాబుని చూసి మురిసిపోతున్నారు. ఇదిలా ఉంటే షాహిద్ కపూర్, మీర్జా రాజ్‌పుత్ దంపతులకు ఆగస్ట్ 26, 2016 సాయంత్రం 7:56 ని.లకు మిషా కపూర్ అనే పండంటి బిడ్డ తొలి సంతానంగా జన్మించిన సంగతి తెలిసిందే. ఆ చిన్నారి బ‌ర్త్‌డే వేడుక‌ల‌ని ఈ మ‌ధ్య విదేశాల‌లో గ్రాండ్‌గా జ‌రిపారు. వారికి రెండో సంతానంగా అబ్బాయి జ‌న్మించ‌డంతో ఫ్యామిలీ అంతా ఆనందంలో ఉంది. 2015లో షాహిద్‌, మీరాలు వివాహ బంధంతో ఒక్క‌ట‌య్యారు . ఇక షాహిద్ న‌టిస్తున్న‌ అర్జున్ రెడ్డి రీమేక్ చిత్రం కబీర్ సింగ్ వచ్చే ఏడాది జూన్‌ 21న విడుదల కానుంది.

View this post on Instagram

Hello World 🌼

A post shared by Mira Rajput Kapoor (@mira.kapoor) on

3750
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles