పెన్సిల్ అత‌ని గ్యాంగ్ వ‌చ్చేసింది- టీజ‌ర్

Wed,July 24, 2019 11:11 AM
Meet PENCIL and his GANG

నేచుర‌ల్ స్టార్ నాని న‌టించిన తాజా చిత్రం గ్యాంగ్ లీడ‌ర్. విక్ర‌మ్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ చిత్రం స‌రికొత్త క‌థాంశంతో రూపొందుతుంది. ఓ గ్యాంగ్ ప్రతీకారం నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రాన్ని ఆగ‌స్ట్ 30న విడుద‌ల చేసేందుకు మేక‌ర్స్ ప్లాన్ చేశారు. ఈ క్ర‌మంలో చిత్ర ప్ర‌మోష‌న్‌లో స్పీడ్ పెంచారు. ప్రీ లుక్, ఫ‌స్ట్ లుక్ , సాంగ్ అంటూ చిత్రానికి సంబంధించి ప‌లు అప్‌డేట్స్ ఇచ్చిన టీం తాజాగా టీజ‌ర్ రిలీజ్ చేసింది. పెన్సిల్‌, అత‌ని గ్యాంగ్ చేసే సంద‌డిని టీజ‌ర్‌లో చూపించారు. పెన్సిల్ పార్ధ‌సార‌ధి పాత్ర‌లో నాని న‌టిస్తుండ‌గా, ఆయ‌న ఫేమ‌స్ రివెంజ్ రైట‌ర్ అని ప‌రిచ‌యం చేసుకుంటాడు. టీజ‌ర్ ఆస‌క్తి రేకెత్తిస్తుంది.

మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, యలమంచిలి రవిశంకర్, మోహన్ చెరుకూరి (సి.వి.ఎం) నిర్మిస్తున్నారు. బామ్మ, వరలక్ష్మి, ప్రియ, స్వాతి, చిన్ను..రివెంజర్స్ అసెంబుల్ అనే వ్యాఖ్యను జోడించి ఇటీవ‌ల విడుద‌లైన‌ ఫస్ట్‌లుక్ ఆసక్తిని రేకెత్తించింది. ఆర్‌ఎక్స్ 100 ఫేమ్ కార్తికేయ కీలక పాత్రను పోషిస్తున్నారు. ప్రియాంక, లక్ష్మి, శరణ్య, అనీష్ కురువిళ్లా, ప్రియదర్శి, రఘుబాబు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం అనిరుధ్ రవిచంద్రన్ అందిస్తున్నారు. ఇదిలా ఉంటే ఆగ‌స్ట్ 30న ప్ర‌భాస్ న‌టించిన సాహో చిత్రం కూడా విడుద‌ల కానుంది. ఈ నేప‌థ్యంలో గ్యాంగ్ లీడ‌ర్ చిత్ర రిలీజ్ డేట్ మారుతుందా అనే దానిపై ఆస‌క్తిక‌ర చ‌ర్చ జ‌రుగుతుంది.

876
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles