అల్ల‌రి న‌రేష్ షో అదిరింది- ట్రైల‌ర్

Sat,August 26, 2017 01:45 PM
Meda Meeda Abbayi Theatrical Trailer

కామెడీతో కిత‌కిత‌లు పెట్టించే అల్ల‌రి నరేష్ ఈ మ‌ధ్య అంత‌గా అల‌రించ‌లేక‌పోతున్నాడు. త‌న తాజా చిత్రం మేడ మీద అబ్బాయిపై చాలా హోప్స్ పెట్టుకున్నాడు. సెప్టెంబ‌ర్ 8న ఈ చిత్రం విడుద‌ల కానుండ‌గా, ఈ మూవీకి జోరుగా ప్ర‌మోష‌న్ కార్యక్ర‌మాలు చేప‌డుతున్నారు. తాజాగా చిత్ర ట్రైల‌ర్ విడుద‌ల చేశారు మూవీ మేక‌ర్స్. అల్ల‌రి న‌రేష్ షో ఎప్ప‌టిలా అదిరిపోగా, జ‌బ‌ర్థ‌స్త్ ఆది, స‌త్యం రాజేష్ కూడా డైలాగ్స్ తో ఆక‌ట్టుకున్నారు. ఒరు వడక్కన్ సెల్ఫీ అనే మలయాళ సినిమానే ప్రజీత్ దర్శకత్వంలో మేడ మీద అబ్బాయి అనే టైటిల్ తో తెలుగులో రీమేక్ చేశారు. ఈ చిత్రం నరేష్ కెరీర్ లో 53వది కాగా ఇందులో నిఖిల్ విమల్ , అవసరాల శ్రీనివాస్ ప్రధాన పాత్రలు పోషించారు. షాన్ రెహమాన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ సినిమాపై అభిమానుల‌లో భారీ అంచ‌నాలు ఉన్న‌ప్ప‌టికి ఈ సినిమా రిలీజ్ రోజే నాగ చైత‌న్య‌- కృష్ణ ఆర్వి ముత్తు కాంబినేష‌న్ లో రూపొందిన యుద్ధం శ‌ర‌ణం విడుద‌ల కానుంది. ఈ రెండింటి మ‌ధ్య బిగ్ ఫైట్ ఉంటుంద‌ని అంటున్నారు.

2249
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles