మేడ మీద అబ్బాయి ఈ సారి హిట్ కొడతాడా ?

Sat,August 5, 2017 09:23 AM
Meda Meeda Abbayi Teaser released

తన కామెడీతో కితకితలు పెట్టే అల్లరి నరేష్ మంచి హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు. స్పూఫ్ కామెడీతో ఆడియన్స్ పొట్ట చెక్కలయ్యేలా నవ్వించాలని భావిస్తున్నప్పటికి ఈ హీరో సినిమాలు అంతగా జనాదరణ పొందడం లేదు. తాజాగా ఒరు వడక్కన్ సెల్ఫీ అనే మలయాళ సినిమాను ప్రజీత్ దర్శకత్వంలో తెలుగులో రీమేక్ చేస్తున్నాడు. మేడ మీద అబ్బాయి అనే టైటిల్ తో ఈ చిత్రం రూపొందుతుండగా ,తాజాగా చిత్ర టీజర్ విడుదల చేశారు. ఇందులో డైలాగ్స్ తో పాటు సినిమాటోగ్రఫీ మూవీపై అంచనాలను పెంచుతుంది. ఇక చివరిలో రామ్ గోపాల్ వర్మ ఈ టీజర్ పై ఏం కామెంట్ పెడతాడో అని అల్లరి నరేష్తో అనిపించడం విశేషం. ఈ చిత్రం నరేష్ కెరీర్ లో 53వది కాగా ఇందులో నిఖిల్ విమల్ , అవసరాల శ్రీనివాస్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. షాన్ రెహమాన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. తాజాగా విడుదలైన టీజర్ పై మీరు ఓ లుక్కేయండి.

2415
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles