చైతూతో పోటికి దిగిన అల్ల‌రోడు

Fri,August 18, 2017 01:28 PM
meda meeda abbayi  release date fixed

త‌న కామెడీతో ఆడియ‌న్స్ ని క‌డుపుబ్బ న‌వ్వించే అల్ల‌రి నరేష్.. రాజేంద్ర ప్ర‌సాద్ కి సీక్వెల్ అని అప్ప‌ట్లో పేరు తెచ్చుకున్నాడు. కాని ఈ మ‌ధ్య వ‌రుస సినిమాలు ఫ్లాపులు ఈ అల్ల‌రోడిని ఆందోళ‌న‌కి గురి చేస్తున్నాయి. ప్ర‌స్తుతం ఒరు వడక్కన్ సెల్ఫీ అనే మలయాళ సినిమాను ప్రజీత్ దర్శకత్వంలో తెలుగులో రీమేక్ చేస్తున్నాడు. మేడ మీద అబ్బాయి అనే టైటిల్ తో ఈ చిత్రం రూపొందుతుండగా ,తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు. సెప్టెంబ‌ర్ 8న ఈ మూవీ విడుద‌ల‌వుతుంద‌ని అల్ల‌రి న‌రేష్ త‌న ట్విట్ట‌ర్ ద్వారా తెలియ‌జేశాడు. ఈ చిత్రం నరేష్ కెరీర్ లో 53వది కాగా ఇందులో నిఖిల్ విమల్ , అవసరాల శ్రీనివాస్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. షాన్ రెహమాన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఇప్ప‌టి వ‌ర‌కు చిత్రానికి సంబంధించిన విడుద‌లైన టీజ‌ర్స్ ఫ్యాన్స్ లో సినిమాపై ఆస‌క్తిని పెంచాయి. అయితే సెప్టెంబ‌ర్ 8న నాగ చైత‌న్య‌- కృష్ణ ఆర్వి ముత్తు కాంబినేష‌న్ లో రూపొందిన యుద్ధం శ‌ర‌ణం విడుద‌ల కానుంది. మ‌రి ఈ రెండు సినిమాలు ఒకే రోజు విడుదల కానుండ‌డంతో బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ఆసక్తిక‌ర ఫైట్ జ‌ర‌గ‌నుంద‌ని విశ్లేష‌కులు చెబుతున్నారు.


1500
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles