లుంగీలో అద‌ర‌గొట్టిన నాని

Wed,October 18, 2017 06:52 PM
mca first look revealed

వ‌రుస హిట్ల‌తో మంచి జోరు మీదున్న నాని ప్ర‌స్తుతం ఎంసీఏ చిత్రంతో పాటు కృష్ణార్జున యుద్ధం అనే సినిమా చేస్తున్నాడు. వేణు శ్రీరాం ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న‌ ఎంసీఏ చిత్రం డిసెంబ‌ర్ 21న విడుద‌ల కానుండ‌గా, దీపావ‌ళి శుభాకాంక్ష‌ల‌తో చిత్ర ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేశారు. లుంగీలో మ‌న నేచుర‌ల్ స్టార్ ఫ్యాన్స్‌కి మంచి కిక్ ఇచ్చాడు. చేతిలో పాల పాకెట్ ప‌ట్టుకుని రోడ్డు మీద జోరుగా వచ్చేస్తున్న యువకుడి పాత్రలో 'ఎంసిఎస‌ అలియాస్ 'మిడిల్ క్లాస్ అబ్బాయి' పోస్టర్ మాత్రం అదుర్స్ అనే చెప్పాలి. దిల్ రాజు నిర్మాణంలో రూపొందుతున్న ఈ చిత్రంలో సాయి ప‌ల్ల‌వి క‌థానాయిక‌గా న‌టించింది. రీసెంట్ గా ఈ మూవీ షూటింగ్ పూర్తి కావ‌డంతో ప్ర‌స్తుతం డ‌బ్బింగ్ కార్య‌క్రమాలు జరుపుకుంటుంది ఈ చిత్రం.


3924
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS