మ‌హాన‌టి మాయాబ‌జార్ మేకింగ్ వీడియో

Thu,June 7, 2018 08:21 AM
Mayabazaar Making Video released

అల‌నాటి అందాల తార సావిత్రి జీవిత నేప‌థ్యంలో తెర‌కెక్కిన చిత్రం మ‌హాన‌టి. మే 9న విడుద‌లైన ఈ చిత్రం ఇంకా మంచి వ‌సూళ్ళ‌నే రాబ‌డుతుంది. మ‌రోవైపు ఈ సినిమాపై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురుస్తూనే ఉంది. రీసెంట్‌గా మ‌హాన‌టి చిత్రాన్ని వీక్షించిన రామ్ చ‌ర‌ణ్ ద‌ర్శ‌కుడితో పాటు కీర్తి సురేష్‌, దుల్క‌ర్ స‌ల్మాన్‌, స‌మంత‌, విజ‌య్ దేవ‌ర‌కొండ మ‌రియు టీం స‌భ్యులు అందరిని ప్ర‌శంసించాడు. అయితే కొద్ది రోజులుగా చిత్రానికి సంబంధించిన మేకింగ్ వీడియోస్‌తో పాటు ర‌న్‌టైం ఎక్కువ కావ‌డంతో తొల‌గించిన కొన్ని స‌న్నివేశాల‌ని విడుద‌ల చేస్తూ వ‌స్తున్నారు నిర్మాత‌లు. ఇవి సినీ ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో అల‌రించాయి. అయితే తాజాగా మాయా బ‌జార్ సన్నివేశానికి సంబంధించిన మేకింగ్ వీడియో విడుద‌ల చేశారు. మాయాబ‌జార్ స‌న్నివేశాలు తెర‌కెక్కించే స‌మ‌యంలో సింగీతం శ్రీనివాస‌రావు సెట్స్‌కి రావ‌డం, ఆయ‌న ద‌ర్శ‌కుడి ప‌నిత‌నంతో పాటు యూనిట్ స‌భ్యుల హార్డ్ వ‌ర్క్‌ని మెచ్చుకోవ‌డం క‌నిపిస్తుంది. ఎస్వీ రంగారావు గెట‌ప్‌లో మోహ‌న్ బాబు సంద‌డి చేయ‌డం కూడా క‌నిపిస్తుంది. మ‌రి ఈ వీడియో మీరు చూసి ఎంజాయ్ చేయండి.


3740
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles