భారీ అగ్నిప్ర‌మాదం..ధ్వంస‌మైన సెట్‌

Wed,April 25, 2018 10:21 AM
Massive fire on Akshay Kumars Kesari set

ఖిలాడీ కుమార్ అక్షయ్ కుమార్ తాజా చిత్రం కేసరి. 1897లో బ్రిటీష్ ఇండియన్ బృందాలకు, ఆఫ్ఘనిస్థాన్ బృందాలకు మధ్య జరిగిన సరాగర్హి యుద్ధం నేపథ్యంలో చిత్రం తెర‌కెక్కుతుంది. అనురాగ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో అక్షయ్ సిక్కుగా కనిపించనున్నాడని తెలుస్తుంది. అక్ష‌య్, క‌ర‌ణ్ జోహార్ చిత్రానికి కో ప్రొడ్యూస‌ర్స్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఇక క‌థానాయిక‌గా ప‌రిణితీ చోప్రా న‌టిస్తుంది. ప్ర‌స్తుతం ఈ చిత్రం మ‌హారాష్ట్ర‌లోని వాయ్‌లో చిత్రీక‌ర‌ణ జ‌రుపుకుంటుంది. కొద్ది రోజులుగా అక్ష‌య్ కుమార్‌తో పాటు ప‌లువురు న‌టీన‌టుల‌తో క్లైమాక్స్ చిత్రీక‌రిస్తున్నారు. రీసెంట్‌గా అక్షయ్ కుమార్ పార్ట్ పూర్తి కావ‌డంతో ఆయ‌న ముంబై వెళ్ళారు. మిగతా యూనిట్ అంతా వాయ్‌లోనే ఉన్నారు.

స‌రాగ‌ర్హి యుద్ధంకి సంబంధించి సీన్స్ తెర‌కెక్కించే క్ర‌మంలో కొన్ని బాంబ్ బ్లాస్ట్ సీన్స్ ప్లాన్ చేశారు. అనుకోకుండా ఒక బాంబ్ భారీగా పేల‌డంతో సెట్ అంతా ద‌గ్ధ‌మైన‌ట్టు తెలుస్తుంది. అయితే ప్ర‌మాదంలో ఎవ‌రు గాయ‌ప‌డ‌క‌పోవ‌డంతో అంతా ఊపిరి పీల్చుకోనున్నారు. మ‌రో ప‌దిరోజుల‌లో చిత్రీక‌ర‌ణ మొత్తం పూర్త‌వుతుంద‌నుకున్న టైంలో ఇలా జ‌ర‌గ‌డంతో నిర్మాత‌లు ఆందోళ‌న చెందుతున్నారు. చిత్ర క‌థానాయిక ప‌రిణితీ చోప్రా ప్ర‌స్తుతం వెకేష‌న్ కోసం ఆస్ట్రేలియా వెళ్లింది. చారిత్రాత్మ‌క చిత్రంగా రూపొందుతున్న కేస‌రి చిత్రం ఆగ‌స్ట్‌లో విడుద‌ల కావ‌ల‌సి ఉండ‌గా, ఈ ప్ర‌మాదం వ‌ల‌న మ‌రి కొద్ది రోజులు డిలే అవుతుంద‌ని అంటున్నారు.

2616
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles