వార్ సీక్వెన్స్ కోసం భారీ ఏర్పాట్లు చేసిన సైరా టీం

Wed,September 19, 2018 09:42 AM
Massive Arrangements For The War Sequence In Sye Raa

మెగాస్టార్ చిరంజీవి 151వ చిత్రం సైరా న‌ర‌సింహారెడ్డి చిత్రం అత్యంత ప్ర‌తిష్టాత్మకంగా తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రం ప్ర‌స్తుతం ఆసియా బోర్డర్ జార్జియాలో షూటింగ్ జ‌రుపుకుంటుంది. 40రోజుల పాటు ఈ దేశంలో షూటింగ్ ప్లాన్ చేయ‌గా, కొద్ది రోజుల త‌ర్వాత భారీ వార్ సీక్వెన్స్ ఎపిసోడ్‌ని తెర‌కెక్కించేందుకు ద‌ర్శ‌కుడు స‌న్నాహాలు చేసుకుంటున్నాడ‌ట‌. ఈ ఎపిసోడ్ కోసం 300 గుర్రాలు,150 మంది జూనియ‌ర్ ఆర్టిస్ట్స్‌తో పాటు కొంత మంది సీనియ‌ర్ స్టార్స్ జార్జియా రానున్న‌ట్టు స‌మాచారం.

50 కోట్ల బ‌డ్జెట్‌తో తెర‌కెక్కే ఈ ఫైట్ సీక్వెన్స్‌లో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఆర్మీ బ్రిటిషర్స్‌తో యుద్ధానికి దిగుతుంది. హాలీవుడ్ స్టంట్ మాస్ట‌ర్స్ ఈ ఫైట్‌ని తెర‌కెక్కించ‌నున్నారు. ఈ ఫైట్ కోసం స్లోవ‌కియా నుండి ప్ర‌త్యేకంగా 3డీ ఫ్లైయింగ్ కెమెరా తెప్పిస్తున్న‌ట్టు తెలుస్తుంది. మొత్తం 500కి పైగా స‌భ్యులు ఫైట్ స‌న్నివేశం కోసం పని చేయ‌నున్నార‌ట‌. గతంలో నందమూరి బాలకృష్ణ ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ షూటింగ్ కూడా ఇదే ప్రాంతంలో జరపడం విశేషం. సైరా చిత్రం వచ్చే ఏడాది స‌మ్మ‌ర్ కానుక‌గా విడుద‌ల కానుండ‌గా, ఇందులో చిరంజీవి స‌ర‌స‌న నయనతార, తమన్నా, ప్రగ్యా జైస్వాల్ కథానాయికలుగా నటిస్తుండగా.. అమితాబ్ బచ్చన్, జగపతిబాబు, సుదీప్, విజయ్ సేతుపతి ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ అమిత్ త్రివేది ఈ హిస్టారికల్ మూవీకి మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు.

943
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS