ర‌వితేజ‌, శృతిల‌పై క్లాప్ కొట్టిన అల్లు అర‌వింద్

Thu,November 14, 2019 11:00 AM

మాస్ మ‌హారాజా ర‌వితేజ, గ్లామ‌ర్ బ్యూటీ శృతి హాస‌న్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో గోపిచంద్ మ‌లినేని తెర‌కెక్కిస్తున్న చిత్రం క్రాక్. కొద్ది సేప‌టి చిత్రం ఈ మూవీ పూజా కార్య‌క్ర‌మాలు పూర్తి చేశారు. అల్లు అరవింద్, సురేంద‌ర్ రెడ్డి, కె రాఘ‌వేంద్ర‌రావు ముఖ్య అతిధులుగా హాజ‌ర‌య్యారు. ర‌వితేజ,శృతిల‌పై అరవింద్ క్లాప్ కొట్ట‌గా, ప‌ర‌చూరి వెంక‌టేశ్వ‌ర‌రావు కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ద‌ర్శ‌కుడు సురేంద‌ర్ రెడ్డి, దిల్ రాజు స్క్రిప్ట్ అందించారు. తొలి షాట్‌ని రాఘ‌వేంద్ర‌రావు డైరెక్ట్ చేశారు. ఈ నెలాఖ‌రు నుండి మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్ జ‌రుపుకోనున్న‌ట్టు తెలుస్తుంది. వాస్త‌వ సంఘ‌ట‌న‌ల ఆధారంగా ఈ మూవీ తెర‌కెక్క‌నుంది. కొన్నేళ్ళ క్రితం తెలుగు రాష్ట్రాల‌లో జ‌రిగిన రియ‌ల్ ఇన్సిడెంట్స్‌తో మూవీని తెర‌కెక్కించనున్నారు . థ‌మ‌న్ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. శృతి హాస‌న్ కథానాయిక‌గా న‌టిస్తున్న ఈ చిత్రంలో ముఖ్య పాత్ర కోసం త‌మిళ స‌ముద్ర‌ఖ‌నిని ఎంపిక చేసింది చిత్ర బృందం. ర‌వితేజ‌, శృతి హాస‌న్, గోపిచంద్ మ‌లినేని కాంబినేష‌న్‌లో తెర‌కెక్కిన బ‌లుపు చిత్రం మంచి విజ‌యం సాధించిన విష‌యం తెలిసిందే.1144
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles