ఫ్యాన్స్ ని ఇంప్రెస్ చేసిన ఫస్ట్ సాంగ్

Sun,February 12, 2017 09:50 AM
Maruvaarthai - Single song

నటుడిగానే కాకుండా అటు నిర్మాతగా ఇటు దర్శకుడిగా చాలా బిజీగా ఉన్న ధనుష్ తన దర్శకత్వంలో పవర్ పాండి అనే చిత్రం తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 14న విడుదల చేయనున్నాడు. ఇక తన నిర్మాణంలో రజినీకాంత్ హీరోగా ఓ మూవీ రూపొందించే ఏర్పాట్లు చేస్తున్నాడు. ఈ చిత్రానికి పా రంజిత్ దర్శకత్వం వహించనున్నాడు. ఇక నటుడిగా విఐపి 2 అనే చిత్రంతో పాటు ఎనై నొక్కి పాయిమ్ తొట్ట అనే సినిమాలలో నటిస్తున్నాడు ఈ తమిళ హీరో.

ఎనై నొక్కి పాయిమ్ తొట్ట అనే తమిళ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుండగా ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ ని ఇటీవల విడుదల అయింది. ఈ టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. గౌతమ్ మీనన్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తోండగా, ఈ మూవీలో ధనుష్ సరసన మేఘా ఆకాశ్ హీరోయిన్ గా నటిస్తోంది. మిస్టర్ ఎక్స్ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. ఇక తాజాగా సినిమాలోని ఫస్ట్ సాంగ్ ని విడుదల చేశారు. ఈ సాంగ్ చాలా రొమాంటిక్ గా ఉంది. థమరి రాసిన ఈ లిరిక్స్ కి సిద్ శ్రీరామ్ తన గొంతు అందించాడు. ఆ సాంగ్ పై మీరు ఓ లుక్కేయండి.

1486
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles