మారుతి నెక్ట్స్ టార్గెట్ పవన్..మహేశ్?

Tue,September 22, 2015 07:21 PM
Maruthi Next Target,Mahesh Or Pavan?


హైదరాబాద్: భలే భలే మగాడివోయ్ సినిమాతో నానికి నాచురల్ స్టార్‌గా గుర్తింపు నిచ్చి మంచి విజయాన్నందించారు టాలీవుడ్ దర్శకుడు మారుతి. తక్కువ బడ్జెట్, మంచి సందేశాత్మకంగా ఉండే స్క్రిప్ట్‌తో సినిమాలతో నిర్మాతలకు కాసుల పంట పండిస్తారు మారుతి. తాజా చిత్రం భలే భలే మగాడివోయ్ విజయాన్ని ఎంజాయ్ చేస్తున్న ఈ దర్శకుడు తర్వాత సినిమా చేయడానికి ఏ స్టార్‌ను ఎంచుకుంటాడో అని ఫిలింనగర్‌లో గుసగుసలాడుకుంటున్నారు.

ఐతే మారుతి తర్వాత చిత్రాన్ని టాలీవుడ్ స్టార్లు మహేశ్‌బాబుతోగానీ పవన్‌కళ్యాణ్ తోగానీ చేయొచ్చని టాలీవుడ్ వర్గాల్లో ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవలే ఓ టీవీ షోకు హాజరైనపుడు పెద్ద హీరోలతో సినిమా తీస్తారా అన్న ప్రశ్నకు మారుతి సమాధానమిస్తూ తప్పకుండా తీస్తా. ఎవరైనా అవకాశమిచ్చినపుడు వారికావాల్సిన స్క్రిప్ట్‌ను ఖచ్చితంగా సిద్ధం చేస్తానని చెప్పడంతో పై ఊహాగానాలన్నీ నిజమేననిపిస్తోంది.

2376
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles