మ‌రోసారి వినోద భ‌రిత చిత్రంతో రానున్న మారుతి !

Sun,February 3, 2019 08:50 AM

నాని ప్ర‌ధాన పాత్ర‌లో భ‌లే భ‌లే మ‌గాడివోయ్ అనే చిత్రాన్ని తెర‌కెక్కించి ప్రేక్ష‌కుల‌ని కడుపుబ్బ న‌వ్వించాడు మారుతి. ఈ చిత్రంకి ముందు యూత్‌ఫుల్ ద‌ర్శ‌కుడిగా ఉన్న మారుతి ఆ త‌ర్వాత ఫ్యామిలీ ఆడియ‌న్స్‌ని కూడా అల‌రిస్తాడ‌నే పేరు తెచ్చుకున్నాడు. ప‌లువురు స్టార్స్‌తో ప‌లు హిట్ చిత్రాలు తీసిన మారుతి చివ‌రిగా నాగ చైత‌న్య ప్ర‌ధాన పాత్ర‌లో శైల‌జా రెడ్డి అల్లుడు అనే చిత్రాన్ని చేశాడు. ఈ చిత్రం మిక్స్‌డ్ టాక్‌తో బాక్సాఫీస్ ద‌గ్గ‌ర మంచి వ‌సూళ్ళ‌నే రాబ‌ట్టింది. ఇక మారుతి త‌ర్వాతి ప్రాజెక్ట్ ఎవ‌రితో ఉంటుంద‌నే దానిపై ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌లు జ‌రుగుతుండ‌గా, బ‌న్నీ లేదా అఖిల్‌ల పేర్లు వినిపిస్తున్నాయి. ప్ర‌స్తుతం త‌న ప్రాజెక్ట్‌కి సంబంధించిన క‌థ‌కి ఫైన‌ల్ ట‌చ్ ఇస్తున్నాడ‌ని తెలుస్తుండ‌గా, ఇది కూడా ప‌క్కా కామెడీ ఎంటర్‌టైన‌ర్‌గానే ఉంటుంద‌ట‌. అతి త్వ‌ర‌లోనే ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన వివరాలు వెల్ల‌డించ‌నున్నార‌ని అంటున్నారు.

1974
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles