తేజూ చిత్రాన్ని ఎమోష‌న‌ల్‌గా తెర‌కెక్కించ‌నున్న మారుతి

Sat,May 11, 2019 09:14 AM

ఆరు ప‌రాజ‌యాల త‌ర్వాత చిత్ర‌ల‌హ‌రి చిత్రంతో మాసివ్ హిట్ కొట్టాడు సాయి ధ‌ర‌మ్ తేజ్. ఈ చిత్రం అందించిన విజ‌యం తేజూకి కొండంత బ‌లాన్ని ఇచ్చింది. త్వ‌రలో మారుతితో క‌లిసి ఓ క్రేజీ ప్రాజెక్ట్ చేయ‌నున్న‌ట్టు ఇటీవ‌ల ప‌లు వార్త‌లు వ‌చ్చాయి. మారుతి- తేజు కాంబినేష‌న్‌లో రానున్న చిత్రం కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఉంటుంద‌ని టాక్ వ‌చ్చింది. కాని తాజా స‌మాచారం ప్ర‌కారం ఈ చిత్రం చాలా ఎమోష‌న‌ల్‌గా ఉంటుంద‌ట‌. హృద‌యాన్ని హ‌త్తుకునే స‌న్నివేశాల‌తో సాగుతుంద‌ట‌. తండ్రి కొడుకుల సెంటిమెంట్ తో ఈ మూవీని మారుతి తెర‌కెక్కించ‌నున్న‌ట్టు తెలుస్తుంది. తేజు తండ్రి పాత్ర‌లో రావు ర‌మేష్ న‌టిస్తార‌ట‌. త్వ‌ర‌లోనే పూజా కార్యక్ర‌మాలు జ‌రుపుకోనున్న ఈ చిత్రంకి సంబంధించి అఫీషియ‌ల్ ప్ర‌క‌ట‌న రావ‌ల‌సి ఉంది. తేజూ రీసెంట్‌గా న‌టించిన చిత్ర‌ల‌హ‌రి చిత్రంలోను తండ్రితో ఎమోష‌న‌ల్ సీన్స్ ఉండ‌గా వాటికి ఆడియ‌న్స్ నుండి మంచి రెస్పాన్స్ వ‌చ్చిన విష‌యం విదిత‌మే.

1968
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles