మీడియా వారికి మారుతి విన్న‌పం

Sun,February 10, 2019 07:23 AM

అప్ప‌టి వ‌ర‌కు యూత్‌ఫుల్ డైరెక్ట‌ర్‌గా ఉన్న మారుతి భ‌లే భలే మ‌గాడివోయ్ చిత్రంతో ఫ్యామిలీ ద‌ర్శ‌కుడిగా మారాడు. ఇప్పుడు ఆయ‌న సినిమాలంటే అభిమానుల‌లో అంతులేని ఆస‌క్తి నెల‌కొంటుంది. చివ‌రిగా శైల‌జా రెడ్డి అల్లుడు చిత్రంతో తెలుగు ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌క‌రించిన మారుతి త‌న త‌దుప‌రి చిత్రాన్ని ఏ హీరోతో చేయ‌నున్నాడు అనే దానిపై కొద్ది రోజ‌లుగా ఆస‌క్తి చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. నానితో లేదంటే సాయి ధ‌ర‌మ్ తేజ్‌తో మారుతి త‌న త‌ర్వాతి ప్రాజెక్ట్ చేయ‌నున్న‌ట్టు ప‌లు వార్త‌లు వ‌చ్చాయి. దీనిపై మారుతి త‌న ట్విట్ట‌ర్ ద్వారా వివ‌ర‌ణ ఇచ్చాడు. డియ‌ర్ మీడియా ఫ్రెండ్స్‌, నేను చేయ‌బోయే త‌ర్వాతి చిత్రానికి సంబంధించి అనేక ఆర్టిక‌ల్స్ చ‌దివాను. మీరు ఎవ‌రి గురించి అయితే చెబుతున్నారో వారితో చేయాల‌ని నాకుంది. కాని ప్ర‌స్తుతం నేను ఎంతో ఎగ్జయిట్ అయిన పాయింట్‌తో కథను సిద్ధం చేసే పనిలో ఉన్నా. స్క్రిప్ట్‌ పూర్తవ్వగానే పూర్తి వివరాలను నేనే తెలియజేస్తా. అందరికీ ధన్యవాదాలు..అని త‌న ట్వీట్‌లో తెలిపారు. దీంతో కొద్ది రోజులుగా జ‌రుగుతున్న ప్ర‌చారానికి పులిస్టాప్ ప‌డింది.1932
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles