బిగ్ బాస్ హౌజ్‌లో పెళ్లి సంద‌డి.. గెస్ట్‌గా అన‌సూయ‌

Wed,August 22, 2018 08:30 AM
marriage celebrations in bigg boss house

బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 2 లో 73వ ఎపిసోడ్ అంతా సంద‌డిగా సాగింది. బిగ్ బాస్ హౌజ్‌ని పూర్తిగా పెళ్ళి ఇల్లుగా మార్చేశారు. ఇంటి స‌భ్యుల‌ని రెండు గ్రూపులుగా విభ‌జించి ఒక గ్రూప్ పెళ్లి కొడుకు రాధాకృష్ణ కుటుంబంగా ఇంకొక గ్రూప్ మ‌ధుల‌త కుటుంబంగా మార్చేశారు. రెండు రోజుల పాటు జ‌ర‌గ‌నున్న ఈ పెళ్లి తంతులో మంగ‌ళ‌వారం రోజు మెహందీ వేడుక‌ని నిర్వ‌హించారు. ఈ రోజు సంగీత్, పెళ్లి వేడుక‌లు జ‌ర‌గ‌నున్నాయి. అయితే మెహందీ వేడుక‌కి హాట్ యాంక‌ర్ అన‌సూయ కూడా హాజ‌రై ఈ వేడుక‌కి మ‌రింత శోభ‌ని తీసుకొచ్చింది.

రాధాక్రిష్ణ, మధులతల బొమ్మల పెళ్లి వేడుకకు పంతులుగా గణేష్ వ్యవహరించారు. పెళ్లి టాస్క్‌లో బ‌హుమ‌తులు పొందేందుకు ఇటు అబ్బాయి త‌ర‌పు వాళ్ళు, అటు అమ్మాయి త‌ర‌పు వాళ్ళు వెరైటీ గేమ్స్ ఆడుతూ ఎంట‌ర్ టైన్ చేశారు. ముందుగా బిగ్ బాస్ .. అబ్బాయి త‌ర‌పు వాళ్ళకి టాస్క్ ఇచ్చారు. ఎవ‌రైన ఇద్ద‌రు స్విమ్మింగ్ పూల్ లో ఉన్న ఉంగ‌రాల‌ని వెతికి తీయాల‌ని అన్నారు. ఇందుకోసం సామ్రాట్‌, దీప్తిలు రంగంలోకి దిగారు. ఇక అమ్మాయి త‌ర‌పు వాళ్ళ‌కి హౌస్‌లో దాచి ఉంచిన చెప్పుల జతలను వెతికి పట్టుకోవాల‌ని చెప్పారు. ఇందు కోసం అమిత్, గీతా మాధురి, తనీష్, గణేష్, పూజాలు కష్టపడి 20 జతల చెప్పులను పట్టుకున్నారు.

బహుమతులు గెలుచుకునేందుకు బిగ్ బాస్ మ‌రో టాస్క్ ఇచ్చారు. పెళ్లి కుమార్తె కుటుంబ సభ్యులకు లడ్డూలను చుట్టాలని, పెళ్లి కుమారుడి కుటంబ స‌భ్యులు దుపట్టాలను అలంకరించడం లాంటి సరదా టాస్క్‌లను ఇచ్చారు. దీంతో ఇంటి స‌భ్యులు త‌మ టాస్క్‌ల‌తో బిజీగా ఉంటూనే త‌మ నామినేష‌న్స్ గురించి కూడా చ‌ర్చికున్నారు. ఇంట్లో అంతా హంగామా న‌డుస్తుండగా బిగ్ బాస్ హౌజ్ లో రారండోయ్ వేడుక చూద్ధాం అనే సాంగ్ ప్లే అయింది. ఆ సాంగ్‌తో అంద‌రిలో నూత‌నుత్తేజం ఎగిసిప‌డ‌గా, వారిలో మ‌రింత ఎనర్జీని నింపేందుకు రంగ‌మ్మ‌త్త అన‌సూయ తాంబూలంతో ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చింది.

హౌజ్‌లో ప్ర‌తి ఒక్క‌రిని ప‌ల‌క‌రించిన అన‌సూయ పెళ్లికి మ‌రింత క‌లరింగ్ ఇచ్చేందుకు త‌ను వ‌చ్చాన‌ని చెప్పుకొచ్చింది. అయితే మీరు అమ్మాయి త‌ర‌పున ఉంటారా,లేక అబ్బాయి త‌ర‌పున ఉంటారా అన్న‌ ప్రశ్నకి , నాకు ఇద్ద‌రు అబ్బాయిలే కాబ‌ట్టి అమ్మాయి సైడే ఉంటాన‌ని చెప్పుకొచ్చింది. ఇక గ్రీన్ క‌ల‌ర్ సారీలో అన‌సూయ‌ని చూసి ఇంటి స‌భ్యుల‌తో పాటు బుల్లితెర ప్రేక్ష‌కులు మురిసిపోయారు. ఈ రోజు ఎపిసోడ్‌లో సంగీత్‌, పెళ్లి వేడుక‌లు జ‌ర‌గ‌నుండ‌గా, ఇందులో రంగ‌మ్మ‌త్తతో క‌లిసి ఇంటి స‌భ్యులు ఏ రేంజ్‌లో సంద‌డి చేస్తారో చూడాలి.

4202
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles