మార్చి 18న డబ్బింగ్ సినిమాల సందడి

Wed,March 9, 2016 03:46 PM
march 18 big fight

సంక్రాంతి బరిలో నాలుగు పెద్ద సినిమాలు పోటి పడగా, ఈ నాలుగు మంచి సక్సెస్‌ సాధించాయి. ఆ తర్వాత భారీ చిత్రాలేవి విడుదలకాకపోయిన చిన్న చిత్రాల సందడి మాత్రం మూములుగా లేదు. రెండు వారాల క్రితం ఏకంగా 9 సినిమాలు ఫైట్‌కు దిగగా, పోయిన వారం నాలుగు సినిమాలు పోటి పడ్డాయి. ఇక ఈ వారం థీయేటర్ల దగ్గర సినిమాలు 8 సినిమాలు పోటి పడే పరిస్థితి నెలకొంది.

మార్చి 11న నారా రోహిత్ ‘తుంటరి’ విడుదలవుతుండగా, ఈ సినిమాకు పోటీగా 7 సినిమాలు రంగంలోకి దిగాయి . ఇక తర్వాతి వారమైతే ఖాళీగా వదిలేశారు. చివరి వారంలో రన్, ఊపిరి లాంటి సినమాలు విడుదల కానుండగా, మార్చి 18న శుక్రవారం చెప్పుకోదగ్గ తెలుగు సినిమాలేవీ రిలీజయ్యేలా లేవు.ఇదే మంచి తరుణం అన్నట్లు ఆ రోజు వరుసగా తమిళ డబ్బింగ్ సినిమాలు రిలీజ్ కు రెడీ అయిపోతున్నాయి.

సూర్య నటించిన 'మేము' చిత్రం డిసెంబర్లో విడుదల కావలసి ఉండగా,ఈ మార్చి 18న విడుదల చేస్తున్నట్లు ఇటీవల ప్రకటించారు. ఇక జనవరిలోనే విడుదల కావాల్సిన విశాల్ మూవీ ‘కథాకళి’ అనివార్య కారణాలతో వాయిదా పడింది. ఆ చిత్రాన్ని 18నే రిలీజ్ చేయబోతున్నారు. ఇక ఎప్పుడో మూడేళ్ల కిందట రిలీజవ్వాల్సిన శర్వానంద్ నిత్యామీనన్ ల ‘ఏమిటో ఈ మాయ’ ఇప్పుడు ‘రాజాధిరాజా’గా పేరు మార్చుకుని 18న విడుదలకు సిద్ధమవుతోంది. ధనుష్, కాజల్ జంటగా నటించిన మారి అనే తమిళ చిత్రం తెలుగులో "మాస్" పేరుతో ఈ నెల 18 నే విడుదలకు సిద్దమయింది. వీటితో బెల్లం రామకృష్ణ రెడ్డి తెరకెక్కించిన 'దృశ్యకావ్యం అనే చిత్రం కూడా మార్చి 18 బరిలో నిలవనుంది.

మార్చి 18 మొత్తం దాదాపు డబ్బింగ్‌ సినిమాలే సందడి చేయడానికి సిద్దమవుతుండగా, ప్రేక్షకులు ఈ సినిమాలను ఎంతగా ఆదరిస్తారో చూడాలి

1713
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles