స‌కాలంలో వైద్యం అంద‌క న‌టి,ఆమె శిశువు క‌న్నుమూత‌

Tue,October 22, 2019 10:00 AM

మరాట్వాడలోని హింగోలి జిల్లాకు చెందిన మరాఠీ సినిమా నటి పూజా జుంజార్(25) . రెండు మరాఠీ చిత్రాల‌లో న‌టించిన ఆమె కొద్ది రోజులుగా సినిమాల‌కి దూరంగా ఉంది. ఇటీవల ఆమె గ‌ర్భం దాల్చ‌గా, ఆదివారం పురిటి నొప్పులు రావ‌డం ప్రారంభించాయి. దీంతో ఆమెకి గోరేగాంలోని ప్రాథ‌మిక ఆరోగ్య కేంద్రానికి త‌ర‌లించారు. పూజా ఓ శిశువుకి జ‌న్మ‌నిచ్చింది. జ‌న్మించిన కొద్దిసేప‌టికే శిశువు మ‌ర‌ణించింది. ఆ స‌మ‌యంలో పూజా జుంజార్ ప‌రిస్థితి కూడా విషమంగా ఉండటంతో ఆమెను హింగోలీలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాలని ప్రాథమిక వైద్యకేంద్రం వైద్యులు సూచించారు.


హింగోలికి త‌ర‌లించేందుకు అంబులెన్స్ కోసం ప్ర‌య‌త్నించారు ఆమె కుటుంబ స‌భ్యులు. స‌కాలంలో అంబులెన్స్ రాక‌పోవ‌డంతో ప్రైవేట్ అంబులెన్స్ లో త‌రలించే ప్ర‌య‌త్నం చేశారు. గోరేగాం నుంచి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న హింగోలికి వెళుతుండ‌గా, మార్గమ‌ధ్యంలో పూజా క‌న్నుమూసింది. పూజా, ఆమె క‌న్న కూతురు ఇద్ద‌రు మ‌ర‌ణించ‌డంతో కుటుంబ స‌భ్యులు క‌న్నీరు మున్నీరుగా రోదిస్తున్నారు. ఆమె మృతికి మ‌రాఠీ సినిమా ప‌రిశ్ర‌మ సంతాపం తెలియ‌జేసింది.

3667
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles