విడుదలకు రెడీ అయిన మోహన్ లాల్ మరో చిత్రం

Sun,November 6, 2016 10:03 AM
Manyampuli released on november 25

ఈ ఏడాది మోహన్ లాల్ మనమంతా, జనతా గ్యారేజ్ వంటి చిత్రాలతో ప్రేక్షకులను పలకరించాడు. ఈ రెండు చిత్రాలలో మోహన్ లాల్ కీలక పాత్ర పోషించగా అభిమానుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ నేపథ్యంలో మలయాళంలో భారీ విజయాన్ని సాధించిన పులి మురుగన్ చిత్రాన్ని తెలుగులో మన్యం పులి టైటిల్ తో విడుదల చేయబోతున్నారు. 100 కోట్ల కలెక్షన్ లు సాధించిన ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా నచ్చుతుందని నిర్మాతలు భావిస్తున్నారు. ఇప్పటికే మన్యం పులి సినిమాకి సంబంధించిన డబ్బింగ్ కార్యక్రమాలు పాటల రికార్డింగ్ కూడా పూర్తి అయిందని చిత్ర బృందం తెలిపింది. ఈ చిత్రాన్ని నవంబర్ 25న ప్రేక్షకుల ముందుకి తీసుకువచ్చేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు నిర్మాత కృష్ణారెడ్డి ప్లాన్ చేస్తున్నారు. దాదాపు రెండు సంవత్సరాలు పాటు ఈ సినిమాను కేరళ, వియత్నాం పరిసర ప్రాంతాల్లో చిత్రీకరించారు. పీటర్ హేన్స్ కంపోజ్ చేసిన ఫైట్స్ ఈ సినిమాకు మెయిన్ హైలెట్ గా నిలుస్తాయని, చిత్ర బృందం తెలిపింది. జగపతి బాబు, కమలినీ ముఖర్జీ కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమాకు వైశాఖ దర్శకత్వం వహించాడు.

1510
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles