మ‌న్మ‌థుడు 2 టీజ‌ర్‌కి ముహూర్తం ఫిక్స్

Wed,June 12, 2019 08:51 AM

చిల‌సౌ ఫేమ్ రాహుల్ ర‌వీంద్ర‌న్ ద‌ర్శ‌క‌త్వంలో నాగార్జున హీరోగా మ‌న్మ‌థుడు 2 చిత్రం తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. ర‌కుల్ ప్రీత్ సింగ్ క‌థానాయిక‌గా న‌టిస్తున్న ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై నాగార్జున నిర్మిస్తున్నాడు. ఆర్ఎక్స్ 100 ఫేమ్ చైతన్య‌ భరద్వాజ్ మ‌న్మ‌థుడు 2 చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. స‌మంత, కీర్తి సురేష్‌ ప్ర‌త్యేక పాత్ర‌లో క‌నిపించ‌నున్నారు. ఒక షెడ్యూల్ మిన‌హా చిత్రీక‌ర‌ణ మొత్తం పూర్తైన‌ట్టు తెలుస్తుంది. చిత్రానికి సంబంధించి విడుద‌లైన ఫోటోలు సినిమాపై భారీ అంచ‌నాలు పెంచాయి. ఈ అంచ‌నాల‌ని మ‌రింత పెంచేలా జూన్ 13 మ‌ధ్యాహ్నాం ఒంటి గంటకి టీజ‌ర్ విడుద‌ల చేస్తున్నారు. ఫ‌న్ రైడ్‌గా తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో వెన్నెల కిషోర్ క‌మెడీయ‌న్‌గా అల‌రించ‌నున్నాడు.

1446
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles