కృష్ణావ‌తారం అయిపోయింది.. ఇక రామావ‌త‌రం స్టార్ట్ - ట్రైల‌ర్

Thu,July 25, 2019 11:12 AM

ఐదు ప‌దుల వ‌య‌స్సులోను న‌వ మ‌న్మ‌థుడిగా అలరిస్తున్న‌ నాగార్జున చిలసౌ ఫేమ్ రాహుల్ ర‌వీంద్ర‌న్ ద‌ర్శ‌క‌త్వంలో మ‌న్మథుడు 2 చిత్రం చేసిన సంగ‌తి తెలిసిందే. ఆగ‌స్ట్ 9న విడుద‌ల కానున్న చిత్ర ట్రైల‌ర్ తాజాగా విడుద‌ల చేశారు. ట్రైల‌ర్ చూస్తుంటే మ‌న్మ‌థుడు చిత్రం మాదిరిగానే ఈ చిత్రం కూడా మంచి విజ‌యం సాధిస్తుందని అభిమానులు భావిస్తున్నారు. చిత్రంలో నాగార్జున కామెడీ, రొమాంటిక్ స‌న్నివేశాలు ఆక‌ట్టుకుంటాయి. నాగార్జున‌ మ‌ధ్య వ‌య‌స్కుడిగా అల‌రించ‌నున్నాడ‌ని చెబుతున్నారు. ట్రైల‌ర్‌లో వెన్నెల కిషోర్ చెప్పే డైలాగ్స్ కామెడీని పంచుతున్నాయి. ట్రైల‌ర్‌ని బ‌ట్టి చూస్తుంటే చిత్రం మంచి విజ‌యం సాధించ‌డం ఖాయ‌మ‌నిపిస్తుంది. ఈ చిత్రంలో కీర్తి సురేష్‌, స‌మంత‌, క‌న్న‌డ బ్యూటీ అక్ష‌రా గౌడ్ కీల‌క పాత్ర‌ల‌లో క‌నిపించ‌నున్నారు. చైత‌న్ భ‌ర‌ద్వాజ్ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. తాజాగా విడుద‌లైన ట్రైల‌ర్‌పై మీరు ఓ లుక్కేయండి.

1327
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles