'మ‌న్మ‌థుడు2' చిత్ర టీజర్ విడుద‌ల‌

Thu,June 13, 2019 01:05 PM
Manmadhudu 2 teaser released

మ‌న్మ‌థుడు చిత్రంతో టాలీవుడ్ మ‌న్మ‌థుడిగా మారిన నాగార్జున ప్ర‌స్తుతం చిల‌సౌ ఫేం రాహుల్ ర‌వీంద్ర ద‌ర్శ‌క‌త్వంలో మ‌న్మ‌థుడు 2 చిత్రం చేస్తున్నాడు. ర‌కుల్ ప్రీత్ సింగ్ క‌థానాయిక‌గా న‌టిస్తున్న ఈ చిత్రంలో కీర్తి సురేష్ ముఖ్య పాత్ర పోషిస్తుంది. రావు రమేశ్‌, లక్ష్మి, ఝాన్సీ, వెన్నెల కిశోర్‌, దేవదర్శిణి ప్ర‌ధాన పాత్ర‌ల‌లో క‌నిపించ‌నున్నారు. మ‌నం ఎంట‌ర్‌ప్రైజ‌స్‌, ఆనంది ఆర్ట్ క్రియేష‌న్స్‌, వ‌య్‌కామ్ 18 స్టూడియోస్‌ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. నాగార్జున స్వయంగా జెమిని కిర‌ణ్‌‌తో కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఆర్‌ఎక్స్ 100 ఫేం చేతన్ భరద్వాజ్ ఈ సినిమాకు సంగీత దర్శకుడుగా ప‌ని చేస్తున్నారు. ఫ‌న్ రైడ్‌గా తెర‌కెక్కుతున్న ఈ చిత్ర షూటింగ్ దాదాపు పూర్తైన‌ట్టు తెలుస్తుంది. అతి త్వ‌ర‌లోనే విడుద‌ల కానున్న ఈ చిత్ర టీజ‌ర్‌ని తాజాగా విడుద‌ల చేశారు. ఈ టీజ‌ర్ సినిమాపై భారీ అంచ‌నాలు పెంచింది. టీజ‌ర్‌లోని డైలాగ్స్‌ని బ‌ట్టి చూస్తుంటే చాలా కాలం త‌ర్వాత నాగార్జున ఈ రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌తో అల‌రించ‌నున్నాడ‌ని తెలుస్తుంది. ఆగ‌స్ట్ 9న చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకు రాబోతున్న‌ట్టు టీజ‌ర్ ద్వారా ప్ర‌క‌టించారు.

1538
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles