స్విట్జ‌ర్లాండ్‌లో నాగ్‌, అమ‌ల‌

Sun,June 30, 2019 09:05 AM

టాలీవుడ్ క్రేజీ క‌పుల్ నాగార్జున‌, అమ‌ల ప్ర‌స్తుతం స్విట్జ‌ర్లాండ్‌లో ఎంజాయ్ చేస్తున్నారు. మ‌న్మథుడు 2 షూటింగ్‌లో భాగంగా నాగ్ స్విట్జ‌ర్లాండ్‌కి వెళ్ల‌గా ఆయ‌న స‌తీమ‌ణి అమ‌ల కూడా అక్క‌డికి వెళ్ళారు. మంచు కొండ‌ల్లో ఫోటోల‌కి ఫోజులిస్తూ ఆ వాతావ‌ర‌ణాన్ని ఎంజాయ్ చేస్తున్నారు ఈ జంట‌. అమ‌ల త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో స్విట్జర్లాండ్ లొకేష‌న్‌లో దిగిన కొన్ని ఫోటోలు షేర్ చేసింది. ఇందులో మ‌న్మ‌థుడు 2 హీరోయిన్ ర‌కుల్ ప్రీత్ సింగ్‌, ద‌ర్శ‌కుడు రాహుల్ ర‌వీంద్ర‌న్ కూడా ఉన్నారు. ఇక‌ ఈ చిత్రంలో కీర్తి సురేష్ ముఖ్య పాత్ర పోషిస్తుంది. రావు రమేశ్‌, లక్ష్మి, ఝాన్సీ, వెన్నెల కిశోర్‌, దేవదర్శిణి ప్ర‌ధాన పాత్ర‌ల‌లో క‌నిపించ‌నున్నారు. మ‌నం ఎంట‌ర్‌ప్రైజ‌స్‌, ఆనంది ఆర్ట్ క్రియేష‌న్స్‌, వ‌య్‌కామ్ 18 స్టూడియోస్‌ సంయుక్తంగా మ‌న్మ‌థుడు 2 చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. నాగార్జున స్వయంగా జెమిని కిర‌ణ్‌‌తో కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఆర్‌ఎక్స్ 100 ఫేం చేతన్ భరద్వాజ్ ఈ సినిమాకు సంగీత దర్శకుడుగా ప‌ని చేస్తున్నారు. ఫ‌న్ రైడ్‌గా తెర‌కెక్కుతున్న ఈ చిత్ర షూటింగ్ దాదాపు పూర్తైన‌ట్టు తెలుస్తుంది. చాలా కాలం త‌ర్వాత నాగార్జున ఈ రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌తో అల‌రించ‌నున్నాడు. ఆగ‌స్ట్ 9న చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురానున్నారు.


2744
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles