పోర్చుగ‌ల్‌లో మ‌న్మ‌థుడు 2 తొలి షెడ్యూల్

Sat,February 16, 2019 08:41 AM
Manmadhudu 2 movie shooting at porchugal

మ‌న్మ‌థుడు చిత్రంతో టాలీవుడ్ మ‌న్మ‌థుడిగా మారిన నాగార్జున‌ని ఇప్ప‌టికి ఆయ‌న అభిమానులు అదే పేరుతో పిలుచుకుంటున్నారు. 2002, డిసెంబర్ 20న నాగ్ ప్ర‌ధాన పాత్ర‌లో తెర‌కెక్కిన‌ మన్మధుడు చిత్రం విడుద‌లై బాక్సాఫీస్ ని షేక్ చేసింది. ఈ చిత్రంలో నాగ్ ఎంతో స్టైలిష్ గా, హ్యాండ్సమ్ గా కనిపించాడు. దీంతో అప్పటి నుండి నాగ్ కి టాలీవుడ్ మన్మథుడు అనే బిరుదుని కట్టపెట్టారు ఆయన అభిమానులు. కె విజయ్ భాస్కర్ దర్శకత్వంలో మన్మథుడు అనే మూవీ తెరకెక్కగా ఇందులో నాగార్జున, సోనాలి బింద్రే, అన్షు ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి ఇప్పడు టాప్ డైరెక్టర్స్ లో ఒకరిగా ఉన్న త్రివిక్రమ్ శ్రీనివాస్ కథ మరియు మాటలు అందించాడు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. ఇటీవ‌ల 15 ఏళ్లు పూర్తి చేసుకున్న మ‌న్మ‌థుడు చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ బేనర్ పై నాగ్ నిర్మించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకి సీక్వెల్ చేయాలనే ఆలోచనలో నాగార్జున వున్నారు .ఆయన సొంత బ్యానర్లో ఈ సినిమా నిర్మితం కానుంది. రాహుల్ రవీంద్రన్ ఈ సినిమాకి దర్శకుడిగా వ్యవహరించనున్నాడు. ఈ సినిమాలో ఇద్దరు కథానాయికలకు చోటు ఉండ‌డంతో పాయ‌ల్ రాజ్‌పుత్‌ని ఒక క‌థ‌నాయిక‌గా ఎంపిక చేశార‌ట‌. మార్చి మొదటి వారంలో ఈ చిత్రం తొలి షెడ్యూల్ జ‌ర‌గ‌నుండ‌గా, పోర్చుగ‌ల్‌లో ఎక్కువ శాతం చిత్రీక‌ర‌ణ‌ని జ‌ర‌ప‌నున్నారని తెలుస్తుంది. త్వ‌ర‌లోనే ఈ ప్రాజెక్ట్‌పై పూర్తి క్లారిటీ రానుంది.

1731
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles