నాగ్ ‘మన్మథుడు 2’ షురూ..ఫొటోలు

Mon,March 25, 2019 05:03 PM


టాలీవుడ్ నటుడు అక్కినేని నాగార్జున నటిస్తోన్న తాజా చిత్రం మన్మథుడు 2. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ నేడు గ్రాండ్‌గా షురూ అయింది. డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ కి రచయిత సత్యానంద్ స్క్రిప్ట్ అందించగా..అమల అక్కినేని ఫస్ట్ క్లాప్ కొట్టారు. నాగ చైతన్య కెమెరా స్విచాన్ చేయగా..దేవుని పటాలపై మొదటి షాట్‌ని షూట్ చేశారు. ఆద్యంతం వినోదభరితంగా సాగే మన్మథుడు 2లో నాగ్‌కు జోడీగా రకుల్‌ప్రీత్ సింగ్ నటిస్తోంది.


ఈ సినిమాను నాగార్జున, పీ కిరణ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. రకుల్‌ప్రీత్ సింగ్ చాలా విరామం తర్వాత ఈ చిత్రంతో మళ్లీ తెలుగులో కనిపించేందుకు రెడీ అవుతోంది. త్వరలో యూరప్ లో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఆర్‌ఎక్స్ 100 ఫేం చేతన్ భరద్వాజ్ ఈ సినిమాకు సంగీతదర్శకుడు.



1904
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles