మ‌న్మ‌థుడు 2 లుక్‌కి ఫ్యాన్స్ ఫిదా

Fri,April 19, 2019 08:32 AM

ఆరు ప‌దుల‌కి చేరువైన ఇప్ప‌టికి టాలీవుడ్ మ‌న్మ‌థుడిగా, గ్రీకు వీరుడిగా అమ్మాయిల మ‌న‌సులు దోచుకుంటున్నారు కింగ్ నాగార్జున‌. ప్ర‌స్తుతం ఆయ‌న రాహుల్ ర‌వీంద్ర‌న్ ద‌ర్శ‌క‌త్వంలో మ‌న్మ‌థుడు 2 చిత్రం చేస్తున్నాడు. ఇటీవ‌ల ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్ళ‌గా , ప్ర‌స్తుతం పోర్చుగ‌ల్‌లో మూవీ చిత్రీక‌ర‌ణ జ‌రుగుతుంది. అయితే చిత్రానికి సంబంధించి కొన్ని పుకార్లు సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొట్ట‌గా వాటికి త‌న ట్విట్ట‌ర్ ద్వారా బ‌దులిచ్చాడు రాహుల్. అలానే మేకింగ్ స్టిల్‌ని కూడా ఒక‌టి రిలీజ్ చేశాడు.


చిత్రంలో నాగ్ స‌ర‌స‌న ర‌కుల్ ప్రీత్ సింగ్ క‌థానాయిక‌గా న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. అయితే నాగ్‌, ర‌కుల్‌కి అస్స‌లు పొస‌గ‌డం లేద‌ని , దాని వ‌ల‌న షూటింగ్ వాతావ‌ర‌ణం అంతా పాడైపోయిందంటూ ప్రచారం జ‌రిగింది. దీనిపై రాహుల్ త‌న ట్విట్ట‌ర్ ద్వారా వివ‌ర‌ణ ఇచ్చాడు. సోష‌ల్ మీడియాలో వ‌చ్చిన వార్త‌లు అస్స‌లు నిజం కాదు. అవి కేవలం పుకార్లు మాత్రమే. పోర్చుగల్‌ షెడ్యూల్‌ స్టార్ట్‌ అయిన తొలి రోజు నుంచే రకుల్‌ మా టీమ్‌తో ఉన్నారు. ఆమె మంచి ప్రతిభాశాలి. అద్భుతంగా నటిస్తోంది. టీమ్‌ అందరం హ్యాపీగా ఉన్నాం అని తెలిపారు. అంతేకాకుండా బ్లాక్ బ‌నియ‌న్‌లో కండ‌లు తిరిగిన దేహంతో ఉన్న నాగ్ లుక్‌ని కూడా విడుద‌ల చేశాడు రాహుల్. కింగ్ ఫ్యాన్స్.. ఈ ఒక్క సీన్ మాత్రం మీ కోస‌మే అని కామెంట్ పెట్టాడు. నాగ్ లుక్ ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాని షేక్ చేస్తుంది.2543
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles