మన్మథుడు 2 కూడా అదే స్థాయిలో ఉంటుంది: నాగార్జున

Thu,July 25, 2019 10:27 PM

మన్మథుడు సినిమా వచ్చి 17 ఏళ్లవుతోంది..మన్మథుడు-2 కూడా అదే స్థాయిలో వుంటుందన్నాడు టాలీవుడ్ యాక్టర్ అక్కినేని నాగార్జున. రాహుల్‌ రవీంద్రన్‌ దర్శకత్వంలో రకుల్‌ ప్రీత్‌సింగ్‌, నాగార్జున కాంబినేషన్ లో వస్తోన్న చిత్రం మన్మథుడు-2. ఆగస్టు 9న విడుదల కానుంది. ఈ సందర్భంగా నాగార్జున, వయాకామ్‌ ప్రతినిధి అజిత్‌ అంధేరి చిత్ర ట్రైలర్‌ని హైదరాబాద్‌లో విడుదల చేశారు.


ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ ‘వయాకామ్‌తో అన్నపూర్ణ స్టూడియోస్‌ అసోసియేట్‌ కావడం ఇదే తొలిసారి. ఏ సమస్య లేకుండా సినిమాని చాలా కూల్‌గా పూర్తి చేశాం. డిస్ట్రిబ్యూటర్స్‌, బయ్యర్స్‌ అంతా లాభాలు పొందాలనే ప్లాన్‌తో ఈ చిత్రాన్ని నిర్మించాం. నిర్మాణ వ్యయం, ఏరియా హక్కులు అంతా హ్యాపీగా ఫీలయ్యే స్థాయిలోనే ప్లాన్‌ చేశాం. ఆద్యంతం వినోదాత్మకంగా సాగే రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌ ఇది. త్వరలోనే ‘మన్మథుడు’ జర్నీ పేరుతో ఓ కార్యక్రమాన్ని నిర్వహించనున్నాం. ‘మన్మథుడు’ చిత్రానికి ఇది రీమేక్‌ కాదు. అయితే జోనర్‌ మాత్రం అదే. ఓ ఫ్రెంచ్‌ సినిమా దీనికి ఆధారం. కేవా మూవీస్‌ నుంచి గీత ఏడాదిన్నర క్రితం ఓ ఫ్రెంచ్‌ చిత్రాన్ని తీసుకొచ్చి మీరు చేస్తే బాగుంటుందని చెప్పింది. ఆ సినిమా చూశాను. బాగా నచ్చడంతో రీమేక్‌ హక్కులు తీసుకుని ఏడాది పాటు వర్క్‌ చేసి సినిమా చేశాం. రాహుల్‌కి విషయం చెప్పి సినిమా చేయమంటే రీమేక్‌ రైట్స్‌ కాపీ చూపించమన్నాడు. సినిమా అందరిని మెప్పించేలా వుంటుందన్నాడు. వయాకామ్‌ 18తో కలిసి అన్నపూర్ణ స్టూడియోస్‌, ఆనంది ఆర్ట్స్‌ సంయుక్తంగాఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

608
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles