మ‌న్మ‌థుడు 2 హీరోయిన్ ఫిక్స్..!

Tue,February 26, 2019 12:10 PM

టాలీవుడ్ మ‌న్మ‌థుడు నాగార్జున చివ‌రిగా దేవదాస్ అనే చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు రాగా, త్వ‌ర‌లో మ‌న్మ‌థుడు 2 అనే చిత్రానికి సీక్వెల్ చేయ‌నున్న‌ట్టు తెలుస్తుంది. చిల‌సౌ చిత్రంతో ద‌ర్శ‌కుడిగా మారిన రాహుల్ రవీంద్రన్ ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్రం తెర‌కెక్క‌నుంది. క‌థానాయిక‌గా ర‌కుల్ ప్రీత్ సింగ్‌ని ఫైన‌ల్ చేశారు. తొలిసారి ర‌కుల్‌.. నాగ్‌తో జ‌త‌క‌ట్టనుండ‌డంతో ప్రాజెక్ట్‌పై అంచ‌నాలు పెరుగుతున్నాయి. ఈ చిత్రానికి ఆర్ఎక్స్ 100 ఫేమ్ చైతన్ భరద్వాజ్ సంగీతం అందించనున్నాడు. అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై నాగార్జున ఈ చిత్రాన్ని నిర్మించనున్నాడు. మార్చి 12న చిత్రం అఫీషియ‌ల్‌గా లాంచ్ కానుంది. తొలి షెడ్యూల్ పోర్చుగ‌ల్‌లో జ‌ర‌గ‌నుంది. ఎక్కువ శాతం చిత్రీక‌ర‌ణ యూర‌ప్‌లో జ‌ర‌ప‌నున్నారని తెలుస్తుంది. ఆర్ఎక్స్ 100 ఫేమ్ చైతన్ భరద్వాజ్ మ‌న్మ‌థుడు 2 చిత్రానికి సంగీతం అందించనున్నాడని సమాచారం. ఆర్ఎక్స్ 100 చిత్ర సంగీతం న‌చ్చ‌డంతో నిర్మాత‌లు ఈ నిర్ణ‌యం తీసుకున్నార‌ని చెబుతున్నారు. అతి త్వ‌ర‌లోనే ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించి అఫీషియ‌ల్ ప్ర‌క‌ట‌న రానుంది.

3028
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles