మ‌న్మ‌థుడు 2 చిత్రం ఫ్రెంచ్ మూవీకి కాపీనా ?

Sat,June 15, 2019 08:43 AM

చిలసౌ ఫేమ్ రాహుల్ ర‌వీంద్ర‌న్ ద‌ర్శ‌క‌త్వంలో నాగార్జున‌, ర‌కుల్ ప్రీత్ సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లుగా రూపొందిన చిత్రం మ‌న్మథుడు 2. ఇటీవ‌ల చిత్ర టీజ‌ర్ విడుద‌ల కాగా ఇందులో నాగార్జున కామెడీ, రొమాంటిక్ స‌న్నివేశాలు సినిమాపై ఆస‌క్తిని పెంచాయి. ద‌ర్శ‌కుడు రాహుల్ ర‌వీంద్ర‌న్ నాగార్జున‌ని మ‌ధ్య వ‌య‌స్కుడిగా చ‌క్క‌గా తీర్చిదిద్దార‌ని పలువురు ప్ర‌శంస‌లు కురిపించారు. అయితే ఈ చిత్ర టీజ‌ర్‌ని బ‌ట్టి చూస్తుంటే మ‌న్మ‌థుడు 2 చిత్రం ఫ్రెంచ్ రొమాంటిక్ కామెడీ ప్రెటీ మోయి టా మెయిన్ ( ప్ర‌పంచ వ్యాప్తంగా ఐ డూ పేరుతో విడుద‌లైంది) మాదిరిగా ఉంద‌ని నెటిజ‌న్స్ ట్విట్ట‌ర్‌లో త‌మ అభిప్రాయాలు వెల్ల‌డిస్తున్నారు. ఫ్రెంచ్ చిత్రంలోను మధ్య వ‌య‌స్కుడైన వ్య‌క్తి త‌న అక్క‌ల‌ని, త‌ల్లిని పెళ్లి చేయ‌మ‌ని వేధిస్తుంటాడు. మ‌న్మ‌థుడు 2 కూడా అదే లైన్‌తో తెర‌కెక్కుతుంద‌నే భావ‌న‌లో నెటిజ‌న్స్ ఉన్నారు. మ‌రి దీనిపై ద‌ర్శ‌కుడు ఏమైన స్పందిస్తాడా అనేది చూడాలి. చిత్రంలో కీర్తి సురేష్‌, స‌మంత‌, క‌న్న‌డ బ్యూటీ అక్ష‌రా గౌడ్ కీల‌క పాత్ర‌ల‌లో క‌నిపించ‌నున్నారు. చైత‌న్ భ‌ర‌ద్వాజ్ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఆగ‌స్ట్ 9న చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురానున్నారు.

1405
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles