మ‌న్మ‌థుడు 2 ఫ్యామిలీ ఫోటో

Tue,April 2, 2019 08:12 AM

నాగార్జున న‌టించిన సూప‌ర్ హిట్ చిత్రాల‌లో మ‌న్మ‌థుడు ఒక‌టి. కె విజ‌య్ భాస్క‌ర్ దర్శకత్వంలో నాగార్జున, సోనాలి బింద్రే, అన్షు ప్రధాన పాత్ర‌ల‌లో తెర‌కెక్కిన ఈ చిత్రానికి సీక్వెల్ మొద‌లైంది. రాహుల్ ర‌వీంద్ర ద‌ర్శ‌క‌త్వంలో తెర‌ర‌కెక్కుతున్న ఈ చిత్రం యూరప్‌లో షూటింగ్ జ‌రుపుకుంటున్న తెలుస్తుంది. తాజాగా చిత్రంలోని ప్ర‌ధాన పాత్రలు పోషిస్తున్న నాగార్జున‌, ర‌కుల్ ప్రీత్ సింగ్‌, వెన్నెల కిషోర్ త‌మ ట్విట్ట‌ర్లో మ‌న్మ‌థుడు 2 ఫ్యామిలీ గ్రూప్ ఫోటో షేర్ చేశారు. ఇందులో నాగ్‌, ర‌కుల్‌,దర్శకుడు రాహుల్‌ రవీంద్రన్‌, రావు రమేశ్‌, లక్ష్మి, ఝాన్సీ, వెన్నెల కిశోర్‌, దేవదర్శిణి తదితరులు ఉన్నారు. ఈ పిక్ అభిమానుల‌ని ఎంత‌గానో అల‌రిస్తుంది. మనం ఎంటర్‌ప్రైజెస్‌, ఆనంది ఆర్ట్‌ క్రియేషన్స్‌ పతాకాలపై నాగార్జున, జెమిని కిరణ్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఆర్‌ఎక్స్ 100 ఫేం చేతన్ భరద్వాజ్ ఈ సినిమాకు సంగీతదర్శకుడుగా ప‌ని చేస్తున్నారు.


1590
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles