ధ‌నుష్‌తో జోడిక‌ట్ట‌నున్న మ‌ల‌యాళీ భామ‌

Tue,January 22, 2019 12:26 PM
Manju Warrier will be playing the female lead in Asuran VetriMaaran

మ‌ల్టీ టాలెంటెడ్ ఆర్టిస్ట్ ధ‌నుష్ ద‌ర్శ‌కుడిగా, నిర్మాత‌గా, న‌టుడిగా వ‌రుస సినిమాలు చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌ల మారి 2 అనే చిత్రంతో ధ‌నుష్ ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు. ఈ సినిమా తెలుగులోను విడుద‌లై మంచి విజ‌యం సాధించింది. ఇక త్వ‌ర‌లో అసుర‌న్ అనే క్రేజీ ప్రాజెక్ట్ చేయ‌నున్నాడు ధ‌నుష్‌. వెట్రిమార‌న్ ద‌ర్శ‌క‌త్వంలో ఇది వెక్కై అనే నవల ఆధారంగా సినిమా చేయ‌నున్నట్టు స‌మాచారం. జ‌న‌వ‌రి 26 నుండి ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్ల‌నుంది. జీవీ ప్ర‌కాశ్ చిత్రానికి సంగీతం అందించ‌నున్నాడు. అయితే ఈ చిత్రంలో కథానాయిక‌గా మ‌ల‌యాళ భామ మంజు వారియ‌ర్‌ని ఎంపిక చేసిన‌ట్టు ధ‌నుష్ త‌న ట్విట్ట‌ర్ ద్వారా తెలిపాడు. ఆమెతో స్క్రీన్ షేర్ చేసుకునేందుకు చాలా ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నాన‌ని ధ‌నుష్ అన్నాడు. ఈ చిత్రం త‌ర్వాత ధ‌నుష్ స‌త్యజ్యోతి ఫిలింస్‌ సంస్థలో ఓ చిత్రం, యువ దర్శకుడు రామ్‌కుమార్‌ దర్శకత్వంలోనూ ధనుష్‌ ఒక చిత్రం చేయనున్నారు. ఇక బ‌హుబాషా చిత్రంగా ధ‌నుష్ ఓ చిత్రాన్ని తెర‌కెక్కించ‌నుండ‌గా, ఈ చిత్రంలో నాగార్జున‌తో పాటు ఎస్‌జే సూర్య‌, అదితిరావు,ధ‌నుష్‌ త‌దిత‌రులు ముఖ్య పాత్ర‌లు పోషించ‌నున్నారు.1599
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles